Dady Emostional Video: డాడీ నువ్వు మాతో రా.. హృదయాలను కదిలిస్తున్న తండ్రి కొడుకుల ఎమోషనల్ వీడియో..
రష్యా సేనల నుంచి తన ప్రజలను, భూభాగాన్ని కాపాడటమే తన తక్షణ కర్తవ్యం అనుకున్న ఓ తండ్రి కుటుంబానికి వీడ్కోలు పలికాడు. చివరి సారిగా ఉక్రెయిన్ నుంచి సురక్షిత ప్రదేశానికి వెళుతున్న తన కుటుంబాన్ని కలిసి ఎమోషనల్ అయ్యాడు. తన తండ్రి తమతో రావటం లేదని..
రష్యా సేనల నుంచి తన ప్రజలను, భూభాగాన్ని కాపాడటమే తన తక్షణ కర్తవ్యం అనుకున్న ఓ తండ్రి కుటుంబానికి వీడ్కోలు పలికాడు. చివరి సారిగా ఉక్రెయిన్ నుంచి సురక్షిత ప్రదేశానికి వెళుతున్న తన కుటుంబాన్ని కలిసి ఎమోషనల్ అయ్యాడు. తన తండ్రి తమతో రావటం లేదని అర్థమైన ఆ చిన్నోడు కన్నీరుమున్నీరయ్యాడు. తనతో పాటు నువ్వూ రా డాడీ అంటూ ప్రేమగా తనదైన శైలిలో అడిగాడు. ప్రస్తుతం ఈ ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.తనతో పాటు తండ్రి రావడం లేదని తెలిసి, తన చిట్టి చేతులతో అతడిని తడుతూ నాతో ఎందుకు రావంటూ తన బాధను వెళ్లగక్కాడు బుడ్డోడు. ఆ పిల్లవాడికి సర్ధిచెప్పే క్రమంలో ఆ సైనిక తండ్రి అతడికి ఒక చాక్లెట్ ఇచ్చే ప్రయత్నం చేయగా.. నాకు అవేమీ వద్దు నువ్వు మాతో వస్తే చాలంటూ చేసిన ప్రయత్నం చూపరుల మనసును కలిచి వేసింది.
మరిన్ని చూడండి ఇక్కడ:
vidya balan: చీరకట్టులో హీరోయిన్ విద్యాబాలన్ హోలీ వేడుకలు.. అట్రాక్ట్ చేస్తోన్న ఫోటోస్..