ఏ ఊరి పులి రా ఇది! డ్రోన్లకే షాకిస్తోంది..!

Updated on: Aug 06, 2026 | 3:58 PM

ఏలూరు జిల్లా పాపికొండల ఏజెన్సీలో సంచరిస్తున్న పెద్దపులిని పట్టుకునేందుకు అటవీశాఖ మెగా ఆపరేషన్ కొనసాగిస్తోంది. వైల్డ్‌లైఫ్ SOS, పీపుల్స్ ఫర్ యానిమల్స్ నిపుణుల బృందాలు ట్రాంక్విలైజర్ గన్స్‌తో రంగంలోకి దిగాయి. రేడియో కాలర్, డ్రోన్లతో పులి కదలికలను ట్రాక్ చేస్తున్నా అది చిక్కకుండా తప్పించుకుంటోంది. పశువులపై వరుస దాడులతో సరిహద్దు గ్రామాల్లో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

ఏలూరు జిల్లాలో పెద్దపులిని బంధించేందుకు అధికారులు నానా తిప్పలు పడుతున్నారు. పులి గాండ్రిపులతో ప్రజలు ఉలిక్కిపడుతుండటంతో.. పాపికొండలు నేషనల్‌ పార్కు ప్రాంతాల్లో ముమ్మర వేట కొనసాగిస్తున్నారు. పులికి ఉన్న ట్రాకర్‌ ద్వారా.. దాని కదలికలపై నిరంతరం నిఘా ఉంచుతూ.. బంధించేయత్నం చేస్తున్నారు. ఏలూరు జిల్లా పాపికొండల ఏజెన్సీలో సంచరిస్తున్న పులిని పట్టుకునేందుకు.. అటవీశాఖ అధికారులు మెగా ఆపరేషన్‌ చేపట్టారు. కొన్నిరోజులుగా పోలవరం జిల్లా సరిహద్దులో సంచరిస్తున్న పులి.. పెద్దసంఖ్యలో పశువులను హతమారుస్తోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో భయాందోళన చెందుతున్న ప్రజలకు నిద్రలేకుండా పోవడంతో.. అధికారులు పులిని బంధించేందుకు కసరత్తు చేస్తున్నారు. పులిని సురక్షితంగా బంధించేందుకు మహారాష్ట్ర, బెంగళూరు నుంచి వైల్డ్‌ లైఫ్‌ SOS, పీపుల్స్‌ ఫర్‌ యానిమల్స్‌ నిపుణుల బృందాలను రంగంలోకి దింపారు. మత్తుమందు తుపాకులతో పులిని నిమిషాల్లో పట్టుకోవడం వీరి ప్రత్యేకత. అనుభవజ్ఞులైన ఆరుగురు ట్రాంక్విలైజింగ్ షూటర్లను క్షేత్రస్థాయిలో మొహరించారు. కొన్ని రోజులుగా పులిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నా.. అది తప్పించుకుపోతుండటంతో వీరిని రప్పించారు. ముందస్తుగా సరిహద్దు గ్రామాల్లో డప్పు చాటింపులు, మైకుల ద్వారా హెచ్చరిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పోలవరం, కొయ్యలగూడెం, గోపాలపురం, బుట్టాయగూడెం మండలాల ప్రజల ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక హడలెత్తిపోతున్నారు. మావన సంచారం ఉన్న ప్రాంతాలు, ప్రత్యేకంగా అమర్చిన మంచెల జోలికి రాకుండా పులి సురక్షితంగా తప్పించుకుపోతుండటంతో అధికారులకు తలనొప్పిగా మారింది. దీంతో అటవి ప్రాంతంలోనే ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుని మరీ పులిని బంధించేలా చూస్తున్నారు. గతంలో కూడా పశువులపై పులి దాడి చేయడంతో.. దాన్ని బంధించిన సమయంలో రేడియో కాలర్‌ ట్రాకర్‌ను అమర్చి తిరిగి అభయారణ్యంలోకి వదిలిపెట్టారు. ఈ మధ్యకాలంలో మళ్లీ జనావాసాల్లోకి వస్తూ దాడి చేస్తుండటంతో.. దాన్ని ట్రాక్‌ చేస్తూ పట్టుకునే పనిలో పడ్డారు. ఎన్ని ప్రయత్నాలు చేస్తు్న్నా.. పులి చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఎప్పటికప్పుడూ చిక్కకుండా తప్పించుకుపోతోంది. డ్రోన్లతో నిఘా పెట్టినా అంతుచిక్కుకుండా మాయమవుతోంది. బంధించేందుకు ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నా.. చాకచక్యంగా అక్కడి నుంచి జారుకుని పోతుండటంతో సరిహద్దు జిల్లాల ప్రజలకు కంటిమీద కునుకులేకుండా పోతోంది. పెద్దపులి దాడిలో ఇప్పటి వరకు వందల సంఖ్యలో పశువులు మృత్యువాత పడ్డాయి. పులి అత్యంత తెలివిగా ప్రవర్తిస్తూ అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. దీంతో నిపుణుల బృందాలు రాత్రింబవళ్లు పక్కా వ్యూహంతో పులి కదలికలను ట్రాక్‌ చేస్తూ పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పులి కదలికల కారణంగా పాపికొండలకు పర్యాటకులు రావడం కూడా తగ్గిపోయారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

WhatsApp: వాట్సాప్‌ యూజర్లకు బిగ్ షాక్..అకౌంట్లు బ్లాక్!

అరుదైన పెళ్లి వేడుక.. కవల వరులు, కవల వధువులు.. ఫాదర్లు, సేవకులు కూడా కవలలే!

టాయిలెట్‌ కోసం బ్రేక్‌ ఇవ్వలేదని దారుణ హత్య.. షాకింగ్‌ నిజం చెప్పిన డ్రైవర్‌

ఏపీలో మహిళలకు ఫ్రీగా లక్ష పట్టుచీరలు! ఊరూరూ తిరిగి పంచుతున్న బీజేపీ నేత

Loading...
Unable to load recommendations.
Follow Us