పోలీసులా.. మాజాకా !! ఇది చూశాక కూడా స్పీడ్‌గా నడిపే దమ్ముందా ??

|

Nov 17, 2024 | 11:38 AM

స్పీడ్‌ థ్రిల్స్‌.. బట్‌ కిల్స్‌.. అతివేగం ప్రమాదకరం.. అంటూ పెట్టిన హెచ్చరికల బోర్డులతో పని కావట్లేదని పోలీసులు భావించారో ఏమో ఏకంగా ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అలాంటి ఇలాంటి కార్యక్రమం కాదు ఇది.. ఆ దృశ్యం చూడగానే ఎంతటి తురుంఖాన్‌ అయినా యాక్స్‌లేటర్‌ మీది నుంచి కాలు తీయాల్సిందే. ఇంటిని యాది చేసుకుంటూ ఒళ్లు దగ్గర పెట్టుకుని బండి నడపాల్సిందే.

ఏపుగా పెరిగిన పొలాల్లో నరదిష్టి పోవడానికి దిష్టిబొమ్మలు పెడతారు. రోడ్లపై యాక్సిడెంట్లు జరుగుతుంటే ముందు జాగ్రత్తగా స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేస్తారు. కానీ ఏలూరు పోలీసులు ఏం చేశారో తెలుసా? ఏకంగా ఫేక్‌ యాక్సిడెంట్‌ మోడల్‌ ఏర్పాటు చేశారు. ఈ మోడల్‌ ఆ రహదారిపై వచ్చిపోయే వారిని అలర్ట్‌ చేస్తుంది. ఆ సన్నివేశం చూసిన వాహనదారులు వామ్మో మన పని కూడా అలాగే అవుతుందోమో ఎందుకైన మంచిది అనుకుంటూ నిదానంగా పోతుండటం గమనార్హం. హైవేపై వెళ్లేవారిని నిత్యం అలర్ట్‌ చేస్తున్న ఆ ఫేక్‌ యాక్సిడెంట్‌ వివరాలను మా ప్రతినిధి రవి అందిస్తారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వామ్మో !! ఎంత పెద్ద ప్రమాదం పెళ్లికూతురికి రాసిపెట్టుంది… అందుకే !!

డ్రైవరన్నా.. ఇదేం పని ?? వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ప్రయాణికుడు

యముడు షార్ట్ బ్రేక్‌.. తీసుకున్నాడనుకుంటా !!

ఒరేయ్ ఎవర్రా మీరు ?? బిజినెస్ కోసం సల్మాన్ ఖాన్ ను ఇలా కూడా వాడేస్తారా ??

విదేశాల్లో ఉండే పాము.. వైజాగ్ ఎలా వచ్చింది ??