AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elephant Viral: అట్లుంటది మరీ ఏనుగుతోని..! గజరాజు కోపం దగ్గర నుంచి చూశారా..? వైరల్ అవుతున్న విజువల్స్..

Elephant Viral: అట్లుంటది మరీ ఏనుగుతోని..! గజరాజు కోపం దగ్గర నుంచి చూశారా..? వైరల్ అవుతున్న విజువల్స్..

Anil kumar poka
|

Updated on: Mar 30, 2022 | 9:00 PM

Share

ఏనుగులు చాలా తెలివైనవి, బలమైనవి. క్రూర మృగాలకు కూడా సమవుజ్జీలుగా నిలుస్తాయి. అలాంటి ఏనుగులకు కోపం వస్తే అది మామూలుగా ఉండదు..బీభత్సమే ఇదిగో ఇక్కడ మీ చూస్తున్న ఈ విధ్వంసం తమిళనాడులో జరిగింది. ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి.


ఏనుగులు చాలా తెలివైనవి, బలమైనవి. క్రూర మృగాలకు కూడా సమవుజ్జీలుగా నిలుస్తాయి. అలాంటి ఏనుగులకు కోపం వస్తే అది మామూలుగా ఉండదు..బీభత్సమే ఇదిగో ఇక్కడ మీ చూస్తున్న ఈ విధ్వంసం తమిళనాడులో జరిగింది. ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. వెంటాడి మరీ హడలెత్తిస్తున్నాయి. ఏనుగుల భయానికి ఆఖరికి అటవీ అధికారులు కూడా వణికిపోతున్నారు. తమిళనాడులోని నవమలై అటవీ ప్రాంతంలో ఏనుగులు హల్‌చల్‌ చేశాయి. అటవీ మార్గంలో వెళ్తున్న విద్యుత్ శాఖ అధికారులపై ఏనుగు దాడి చేసింది. వాహనాన్ని వెంబడించి మరీ ధ్వంసం చేసింది. ఈ దాడిలో కార్ డ్రైవర్‌కి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అటు తమిళనాడు-కర్ణాటక సరిహద్దు అటవీ ప్రాంతంలో మరో ఘటన జరిగింది. కర్ణాటక అటవీశాఖ అధికారుల సహాయంతో, ముదుమలై విహారయాత్రకు వెళ్లారు కొంతమంది పర్యాటకులు. రిజర్వు ఫారెస్ట్‌లో పర్యటిస్తుండగా, ఒక్క సారిగా వారిపై దాడికి ప్రయత్నిచింది ఓ గజరాజు. వారిని అడవిలో చాలాదూరం వెంబడించింది. జీప్ డ్రైవర్ చాకచక్యంగా వాహనాన్ని నడపడంతో ప్రమాదం తప్పింది. ఏనుగు వెంబడిస్తుంటే, ప్రాణాలు అరచేతిలోకి వచ్చాయని చెబుతున్నారు టూరిస్టులు. డ్రైవర్‌ సమయస్పూర్తి వల్లే బతికి బయటపడ్డామని చెప్పారు.ఈ రెండు ఘటనలతో అడవి మార్గాల్లో వెళ్లాలంటేనే జంకుతున్నారు ప్రజలు. అటు అటవీ ఆధికారులు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, గతంలో ఏనుగులు ఎప్పుడూ ఇలా దాడులు చేయలేదని, ఈ మధ్యే పెరిగాయని అంటున్నారు అధికారులు. రాత్రిపూట అటవీ మార్గాల్లో ప్రయాణాలు చేయొద్దని సూచిస్తున్నారు. అటు ఏనుగుల సంచారంపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. అడవులకు సమీపంలో ఉండే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఏనుగులు కనిపిస్తే ఎదురుగా వెళ్లొద్దని అంటున్నారు ఆఫీసర్లు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Viral Video: ఓరి వీడి దుంపతెగ.. ఎంత పని చేసాడు.. రోగిని పట్టుకొని అర్జున్ రెడ్డి సీన్ రిపీట్ చేసాడు..

viral Video: ఇంటి అద్దె కట్టలేక ఆఫీసులోనే మకాం పెట్టేసాడు.. తర్వాత ఏమైందంటే..?

NTR-Ram Charan-RRR: ఒకరు మన్యం ధీరుడు.. మరొకరు గిరిజన వీరుడు.. రామ్ భీమ్‌ల మధ్య స్నేహం..

Python Viral Video: బాబోయ్‌ భారీ కొండచిలువ..! వయ్యారి నడక చూస్తే వణుకే.. ఇలాంటి వీడియో చేస్తే తట్టుకోలేరు..

Kajal Aggarwal: పంచదార బొమ్మ ‘కాజల్ అగర్వాల్’ మరోసారి అదిరిపోయే బేబీ బంప్‌ ఫొటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంది..

Viral Video: రష్యా సైనికులకు ఓ ‘మోడల్‌’ ఆఫర్‌.. పుతిన్‌ను ఎదిరించిన వారికి పడక సుఖాన్ని అందిస్తా..! (వీడియో)