దేవుడితోనే ఆటలా… హుండీలో బొమ్మ నోట్లు

Updated on: Nov 07, 2025 | 4:09 PM

భక్తులు ఆలయాలకు వెళ్లినప్పుడు దేవునికి మొక్కుకుని హుండీలో కానుకలు వేస్తుంటారు. కొందరు నగదు హుండీలో వేస్తే.. మరికొందరు ఆభరణాలు, ఇంకొందరు ముడుపులు వేస్తుంటారు. అప్పుడప్పుడూ హుండీలో విదేశీ కరెన్సీ కూడా దర్శనమిస్తుంటుంది. అయితే తాజాగా ఓ దేవాలయం హుండీలో పిల్లలు ఆడుకునే బొమ్మనోట్లు కనిపించాయి.

హుండీకౌంటింగ్‌ సమయంలో వాటిని గుర్తించిన ఆలయ సిబ్బంది అవాక్కయ్యారు. దేవుడితోనే ఆటలా అని ఆశ్చర్యపోయారు. ఈ ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. తాజాగా, ద్వారకా తిరుమల దేవస్ధానం అధికారులు హుండీ లెక్కించారు. దేవస్థానానికి రికార్డు స్ధాయిలో ఆదాయం లభించింది. 41 రోజులకు గాను రూ.4.22 కోట్లకు పైగా నగదు, 569 గ్రాముల బంగారం, 7708 కిలోల వెండి లభించాయి. వీటితో పాటు చెల్లని పాత నోట్లు 30 వరకు రూ.500 నోట్లు, 20 వెయ్యి రూపాయల నోట్లు , మూడు 2వేల రూపాయల నోట్లతో పాటు విదేశీ కరెన్సీ ఉంది. అయితే ఎన్నడూ లేని విధంగా ఈ సారి బొమ్మనోట్లు 500 కట్టగా వేశారు. దీంతో అధికారులు ఆశ్చర్యపోయి వాటినిపక్కన పెట్టారు. తెలిసీ తెలియక.. చిన్నారులు ఎవరైనా వీటిని వేసి ఉంటారేమోనని అధికారులు భావిస్తున్నారు. ద్వారకాతిరుమల చిన వెంకన్న స్వామి ఆలయానికి ఇప్పటికీ రద్దు అయిన నోట్లు వస్తూనే ఉన్నాయి. వీటిని రిజర్వ్ బ్యాంక్ కు వెళ్లి దేవస్ధానం అధికారులు మారుస్తున్నారు. అయితే, రద్దు అయిన లేదా చెల్లని నోట్లు దేవుడికి ఇవ్వటం ఎంత వరకు కరెక్ట్ అనే చర్చ ఒకవైపు జరుగుతుండగా.. తాజాగా బొమ్మ నోట్ల కట్టలు దేవస్ధానం హుండీలో వెలుగుచూడటం చర్చ నీయాంశంగా మారింది. దేవుడా నేను కష్టాల్లో ఉన్నాను.. వీటిని తీర్చు.. కష్టాలు తీరి కోలుకుంటే ఫలానాది నీకు సమర్పించుకుంటాను అని భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. అయితే, కోరికలు తీరిన తర్వాత కొందరు అనుకున్న విధంగా డబ్బు, తలనీలాలు సమర్పించడం, బంగారం, వెండి , తులా భారం ఇలా పలు విధాలుగా మొక్కులు చెల్లించుకుంటారు. అయితే, తాజాగా హుండీలో బొమ్మ నోట్లు చూసి అధికారులే షాకయ్యారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాత బ్యాంకు ఖాతాలలో డబ్బు మర్చిపోయారా ?? అయితే ఈ విధంగా చేయండి

సాఫ్ట్‌వేర్ కొలువుల ఊచకోత.. లక్ష దాటిన తొలగింపులు

ఇది కదా సాయం అంటే.. తల్లి వర్థంతి వేళ.. రైతుల అప్పులు తీర్చాడు

TOP 9 ET News: ‘శభాష్‌ రామ్‌ చరణ్‌! మంచి నిర్ణయం తీసుకున్నావ్‌..’

బుద్ది లేనోడు.. గడ్డి తిన్నోడే.. అలా చేస్తాడు..