అసలు ఆమె త‌ల్లేనా ?? తాగిన మత్తులో 12 ఏళ్ల‌ కొడుక్కి వింత‌ శిక్ష‌

Updated on: Feb 23, 2026 | 8:01 PM

అమెరికాలోని శాన్ ఆంటోనియోలో కన్నతల్లి నిర్లక్ష్యం వెలుగుచూసింది. మద్యం మత్తులో ఉన్న విక్టోరియా క్రూజ్ తన 12 ఏళ్ల కుమారుడిని 30 కిలోమీటర్లు నడుచుకుంటూ పాఠశాలకు వెళ్లమని చెప్పింది. బాలుడు హైవే పక్కన నడుస్తుండగా గుర్తించిన ఒకరు పోలీసులకు సమాచారమిచ్చారు. విచారణలో తల్లి నిర్లక్ష్యం బయటపడటంతో ఆమెను అరెస్టు చేశారు. 12.5 లక్షల బాండ్ పై బెయిల్ మంజూరైంది.

కన్నతల్లి ప్రేమకు పరిమితులు ఉండ‌వు. తన బిడ్డకు ఏ కష్టం రాకుండా ప్రతి క్షణం కంటికి రెప్పలా చూసుకునే అమ్మ ప్రేమకు మరేదీ సాటిరాదు. అయితే కొంత‌మంది వివాహేతర సంబంధాలు, ఇతర కారణాలతో కన్న బిడ్డల పట్ల కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. అమెరికాలోని శాన్ ఆంటోనియోలో మద్యం మత్తులో ఉన్న విక్టోరియా క్రూజ్‌ అనే మహిళ అమానుషానికి ఒడిగట్టింది. విక్టోరియా క్రూజ్ భ‌ర్త‌తో విడిపోయి ఒంట‌రిగా ఉంటోంది. ఆమెకు 12 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఓ రోజు రాత్రి విక్టోరియా తన ప్రియుడితో గొడవపడి, పూటుగా మద్యం సేవించి మ‌త్తులోకి వెళ్లిపోయింది. మరుసటి రోజు ఉదయం బాలుడు ఆమెను నిద్రలేపి స్కూల్లో దింపాలని కోరగా, ఆమె అతడిని ఒంటరిగానే నడిచి వెళ్లమని చెప్పింది. దీంతో పిల్లాడు చేసేదేమి లేక 30 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న స్కూలుకు న‌డిచివెళ్ల‌డం ప్రారంభించాడు. అయితే అత్య‌వ‌స‌ర వాహ‌నాలు వెళ్లే ట్రాఫిక్ లేన్ల పక్కనే ఆ బాలుడు న‌డ‌వ‌డం ఒక‌రు గ‌మ‌నించారు. వెంట‌నే అనుమానం వ‌చ్చి ఆ వ్య‌క్తి పోలీసులుకు స‌మాచార‌మందించాడు. స్పందించిన పోలీసులు బాలుడిని పాఠాశాల‌కు తీసుకువెళ్లారు. పాఠశాల రిసోర్స్ అధికారి బాలుడిని ప్ర‌శ్నంచిగా అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. త‌న త‌ల్లి సూచ‌నల మేర‌కే ఒంటరిగా న‌డిచివ‌చ్చాన‌ని చెప్పాడు. పోలీసులు విక్టోరియా ఇంటికి వెళ్లి విచారించగా, తన కుమారుడు ఒంటరిగా నడిచి వెళ్తున్న విషయం తనకు తెలుసునని ఆమె అంగీకరించింది. దీంతో బిడ్డ ప‌ట్ల నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించినందుకు ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజ‌ర‌ప‌రిచారు. అనంత‌రం 15,000 డాలర్లు అంటే దాదాపు 12.5 లక్షల రూపాయల వ్యక్తిగత బాండ్ సమర్పించిన తర్వాత ఆమెకు బెయిల్ మంజూరు చేసారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నగరాభివృద్ధికి 21 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చిన దాత

Gold Price Today: మళ్లీ దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలు!

గోమాత మాతృ హృదయం.. మేకపిల్ల ఆకలి తీర్చి..

మంత్రగత్తె అనుమానంతో.. మహిళకు నిప్పంటించిన మూక

వామ్మో.. రెండు తలల పాము.. బెంబేలెత్తిన జనం

Follow Us