Loading video

AP News: మేకను మింగేసిందనే అనుమానంతో కొండచిలువను కొట్టి పొట్ట చీల్చారు.. కట్ చేస్తే..

|

Nov 03, 2024 | 4:00 PM

అటవీ ప్రాంతంలో భారీ కొండచిలువను గుర్తించారు రైతులు. దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేయగా.. అది వారిపైకి దూసుకువచ్చే ప్రయత్నం చేసింది. దాని బొట్ట భారీగా ఉండటంతో.. మేకను మింగిందేమో అన్న అనుమానం వచ్చింది వారికి.. దీంతో....

అల్లూరి ఏజెన్సీలో భారీ కొండచిలువను గిరిజనులు కొట్టి చంపేశారు.  10 అడుగుల పొడవున్న కొండచిలువ ఒక మేకను మింగేసిందనే అనుమానంతో దాని చంపేసి పొట్ట చీల్చి చూశారు.. లోపల నుంచి ఓ కుక్క బయటపడింది. కుక్కను మింగిన కొండచిలువ కదల్లేక చాలాసేపు అక్కడే ఉండిపోవడంతో.. అటుగా వెళ్తున్న గిరిజనులు దాన్ని గమనించారు.. మేకను తినేసిందనే కారణంతో దాన్ని కొట్టి చంపారు..అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం గొడుగులంబంద అటవీప్రాంతంలో జరిగిందీ ఘటన..ఘటన తాలూకా వీడియో వైరల్‌గా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: మంద నుంచి నాలుగు గొర్రెలు మిస్సింగ్.. వాటి కోసం వెతుకుతుండగా..

Published on: Nov 03, 2024 03:56 PM