Doctor Suicide: ముంబైలో దారుణం.. సముద్ర వంతెన పై నుంచి దూకిన 43 ఏళ్ల మహిళా డాక్టర్.
ముంబైలో అటల్ సేతు బ్రిడ్జి పైనుంచి దూకి 43 ఏళ్ల మహిళా డాక్టర్ ఆత్మహత్య చేసుకుంది. ఆమె తన తండ్రికి సూసైడ్ నోట్ రాయడంతో అతడు భోయివాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాం కోసం గాలిస్తున్నారు. అటల్ సేతు బిడ్జిని ముంబైలో కొత్తగా నిర్మించారు.కింజల్ కాంతిలాల్ షా వృత్తి రీత్యా వైద్యురాలు. ఆమె డిప్రెషన్‌తో బాధపడుతూ చికిత్స పొందుతోందని పోలీసులు పేర్కొన్నారు.
ముంబైలో అటల్ సేతు బ్రిడ్జి పైనుంచి దూకి 43 ఏళ్ల మహిళా డాక్టర్ ఆత్మహత్య చేసుకుంది. ఆమె తన తండ్రికి సూసైడ్ నోట్ రాయడంతో అతడు భోయివాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాం కోసం గాలిస్తున్నారు. అటల్ సేతు బిడ్జిని ముంబైలో కొత్తగా నిర్మించారు. కింజల్ కాంతిలాల్ షా వృత్తి రీత్యా వైద్యురాలు. ఆమె డిప్రెషన్‌తో బాధపడుతూ చికిత్స పొందుతోందని పోలీసులు పేర్కొన్నారు. మానసిక ఒత్తిడి భరించలేకనే ఆమె ప్రాణాలు తీసుకున్నట్లు వెల్లడించారు. ముంబైలోని పరేల్ ప్రాంతంలోని ఇంటి వద్ద తాజాగా ఆమె ట్యాక్సీ ఎక్కి అటల్ సేతు బ్రిడ్జి పై కొంత దూరం వెళ్లాక టాక్సీని ఆపమని ఆమె డ్రైవర్‌ను కోరింది. కానీ అతడు ఆపేందుకు నిరాకరించాడు. ఆమె పట్టుబట్టడంతో వాహనాన్ని ఆపాడు. ఆమె కారులో నుంచి దిగిన వెంటనే వంతెనపై నుంచి దూకేసింది. అనంతరం డ్రైవర్ నవీ ముంబై పోలీసులకు సమాచారం అందించాడు, వారు కోస్టల్ పోలీసులు, స్థానిక గ్రామస్తుల సహాయంతో ఆమె జాడ కోసం ఆపరేషన్ ప్రారంభించారు.
ఏదో పని నిమిత్తం బయటకు వెళ్తున్నట్లు తండ్రికి ఆమె ఫోన్ చేసి సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. ఆమె తండ్రి ఇంట్లో ఉన్న సూసైడ్ నోట్‌ను చూశారని.. తన జీవితాన్ని ముగించడానికే అటల్ సేతుకు వెళుతున్నట్లు ఆమె సూసైడ్ నోట్‌లో పేర్కొంది. దీంతో ఆమె తండ్రి ముంబైలోని భోయివాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. CCTV ఫుటేజీని పరిశీలించగా ఆమె సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో వంతెనపై ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు తెలిసింది. ఎనిమిదేళ్లుగా తీవ్రమైన డిప్రెషన్ కారణంగానే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.