హ్యాట్సాఫ్‌.. కాకి కోసం ప్రాణాలకు తెగించి

Updated on: Sep 03, 2025 | 6:36 PM

మనుషులు చేసే కొన్ని తప్పిదాలకు మూగజీవులు బలైపోతుంటాయి. అయినా కూడా చాలామంది పశుపక్ష్యాదుల ప్రాణాలను చాలా తేలికగా తీసుకుంటారు. కానీ మూగజీవుల రక్షణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టే జంతు ప్రేమికులు కూడా ఉంటారు. ఆ కోవకు చెందిన వ్యక్తే ఫైర్‌ మెన్‌ ప్రసాద్‌. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పతంగి దారాల్లో చిక్కుకుని సెల్‌ టవర్‌కి వేలాడుతున్న కాకిని రక్షించి అందరితో శభాష్‌ అనిపించుకున్నారు.

ఈ ఘటన వరంగల్‌ జిల్లాలో జరిగింది. వరంగల్‌ నగరంలోని 39వ డివిజన్‌ సాకరాశికుంట ప్రాంతంలో ఓ సెల్‌ టవర్‌పై పతంగి దారాలకు చిక్కుకుని కాకి వేలాడుతూ ఉంది. తోటి కాకులు కావ్‌ కావ్‌ మంటూ ప్రమాదంలో ఉన్న కాకికి ధైర్యం చెబుతున్నట్టుగా దాని చుట్టూ తిరుగుతున్నాయి. కాకుల అరుపులు విని ఏం జరిగిందని గమనించిన స్థానికులకు సెల్‌టవర్‌పై చిక్కుకున్న కాకి కనిపించింది. నిస్సహాయంగా అరుస్తున్న ఆ కాకిని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది కాళ్లకు దారం చుట్టుకొని సహాయం కోసం అరుస్తూ సెల్‌టవర్‌కు వేళాడుతున్న కాకిని చూసి కాపాడేందుకు సిద్ధమయ్యారు. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఫైర్ మెన్ ప్రసాద్ తన ఆఫీసర్ సూచనల మేరకు తోటి సిబ్బంది సహకారంతో టవర్ ఎక్కి కాకిని రక్షించాడు. కాకి కాళ్లకు చుట్టుకున్న దారాలను విడిపించి కాకిని వదిలిపెట్టాడు. ప్రమాదం నుంచి కాపాడిన ఆ వ్యక్తికి కృతజ్ఞతలు చెబుతున్నట్టుగా ఆ పక్షి కావ్‌ కావ్‌ మంటూ ఆనందంగా తోటి కాకులతో కలిసి ఎగిరిపోయింది. స్థానికుల సమాచారం అందుకుని వెంటనే స్పందించిన ఫైర్‌ సిబ్బందిని, కాకిని కాపాడిన ప్రసాద్‌ను అభినందించారు స్థానికులు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కాళ్లు చచ్చుబడిన కన్నకొడుకు.. ఇంట్లోకి రానివ్వని తండ్రి

భర్త కళ్లలో కారం కొట్టి హత్య.. కారణం ఇదే

నల్గొండ కేతమ్మకు.. బంపర్ ఆఫర్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్

లోబోకు ఏడాది జైలు శిక్ష..! ఇద్దరి చావుకు కారణం..7 ఏళ్ల తర్వాత తీర్పు

భయానికే భయం పుట్టిస్తున్న హర్రర్ ఫిల్మ్.. అస్సలు మిస్ కావద్దు