అబ్బురపరుస్తున్న శ్రీరామ కళారూపాలు.. 600 రూబిక్‌ క్యూబ్స్‌తో శ్రీరాముని రూపం

|

Jan 23, 2024 | 12:57 PM

500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం అయోధ్యలో తన స్వగృహంలో బాలరాముడు కొలువుదీరుతున్న శుభతరుణంలో యావత్‌ భరతఖండం శ్రీరామనామ స్మరణతో పులకించిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులు తమదైనశైలిలో రామభక్తిని చాటుకుంటున్నారు. అమెరికాలో సైతం టెస్లా కార్లతో శ్రీరామనామాన్ని లిఖిస్తూ లైట్ షో నిర్వహించారు. భారతదేశంలో పలుచోట్ల వివిధ కళాకారులు, తమలోని కళను రామునికి అంకితం చేస్తూ రాముని రూపాలను ఆవిష్కరించారు.

500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం అయోధ్యలో తన స్వగృహంలో బాలరాముడు కొలువుదీరుతున్న శుభతరుణంలో యావత్‌ భరతఖండం శ్రీరామనామ స్మరణతో పులకించిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులు తమదైనశైలిలో రామభక్తిని చాటుకుంటున్నారు. అమెరికాలో సైతం టెస్లా కార్లతో శ్రీరామనామాన్ని లిఖిస్తూ లైట్ షో నిర్వహించారు. భారతదేశంలో పలుచోట్ల వివిధ కళాకారులు, తమలోని కళను రామునికి అంకితం చేస్తూ రాముని రూపాలను ఆవిష్కరించారు. ఒకరు టైపు రైటరుపై రాముని రూపాన్ని చిత్రిస్తే.. ఇంకొకరు మొక్కలతో రూపొందించారు.. కొందరు విద్యార్ధులు రామనామం ఆకారంలో కూర్చుని తమ భక్తిని చాటుకున్నారు. కొందరు సూక్ష్మరూపంలో అయోధ్య స్వర్ణ మందిర నమూనాను తయారుచేస్తే.. మరో కళాకారుడు రామాయణంలోని ముఖ్య ఘట్టాలను తన చిత్రలేఖనంలో చిత్రీకరించి ఆకట్టుకున్నారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఓ కళాకారుడు శ్రీరాముని సైకత శిల్పాన్ని రూపొందించి రాముని ఆగమనాన్ని స్వాగతించారు. ఇలా దేశంలోని కళాకారులందరూ తమ రామభక్తిని చాటుకుంటున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లాకు చెంది దంపతులు కొంత వైవిధ్యంగా ఆలోచించి రూబిక్‌ క్యూబ్స్‌తో రాముని రూపాన్ని ఆవిష్కరించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

20 వేల నాణాలతో అయోధ్య రామ మందిరం

దేశంలోనే అరుదైన శస్త్ర చికిత్స.. వ్యక్తికి చేయి మార్పిడి

ప్రధాని మోదీకి థ్యాంక్స్ చెప్పిన ఖుష్బూ.. ఎందుకంటే ??

Bank Holidays: ఈ వారంలో 4 రోజులు బ్యాంకులకు సెలవు

కళాకారుడి అపురూప సృష్టి.. రామయణం మొత్తం సూక్ష్మ చిత్రాలలో

Follow us on