22 ఏళ్లుగా ఇలాగే ఉన్నారు.. ఇంకా ఎన్నాళ్లిలా ??

|

Oct 21, 2024 | 8:38 PM

అవిభక్త కవలలు వీణ-వాణీ 22వ బర్త్‌డే జరుపుకున్నారు. ఇద్దరు అవిభక్త కవలలను విడదీయాలని ప్రభుత్వాలను, వైద్యులను వేడుకుంటున్నా ఫలితం లేదని వారి తల్లిదండ్రులు బాధపడుతున్నారు. పుట్టినప్పటి నుంచి 13 ఏళ్ల దాకా హైదరాబాద్‌లోని నీలోఫర్‌ ఆసుపత్రి వారికి అండగా నిలిచింది. కొంత కాలం క్రితం వీరిని హైదరాబాద్‌లోని శిశు వివాహార్‌ స్టేట్‌హోంకు తరలించారు.

పిల్లలు రోజురోజుకు నరకయాతన అనుభవిస్తున్నారనీ శస్త్రచికిత్సకు అవసరమైన ఖర్చును ప్రభుత్వం భరించాలని కోరుతూ అప్పటి ముఖ్యమంత్రులను కలిసినా ఫలితం లేకుండా పోయిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెం గ్రామానికి చెందిన మారగాని మురళీ-నాగలక్ష్మి దంపతులకు నలుగురు కూతుర్లు, పెద్ద కుమార్తె బింధు, రెండో సంతానంగా వీణవాణీ అవిభక్త కవలలుగా జన్మించారు. సింధు నాలుగో సంతానం. 2003 అక్టోబర్‌ 16న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో వీణా వాణి జన్మించారు. పుట్టుకతో వీరు తలలు కలిసి జన్మించారు. నిరుపేద కుటుంబం కావడంతో రెండేళ్ల పాటు గుంటూరుకు చెందిన వైద్యుడు నాయుడమ్మ దగ్గర చికిత్స అందించారు. అనంతరం 2006లో హైదరాబాద్‌ నీలోఫర్‌ అసుపత్రికి తరలించారు. ఇద్దరిని వేరు చేసేందుకు ముంబయిలోని బ్రీచ్‌కండీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మూడు నెలల పాటు అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి ఆపరేషన్‌ చేయకుండా వైద్యులు చేతులెత్తేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సిడ్నీ బీచ్‌లో వింత ఘటన.. బీచ్‌ మూసివేత..

CPR Training: హార్ట్ స్ట్రోక్ వస్తే పిల్లలకు..పెద్దలకు ఫస్ట్ ఎయిడ్ ఎలా చెయ్యాలి

సైన్యంలోకి కొత్తగా 14 లక్షల మంది.. ఉత్తర కొరియా ఏం చేస్తోంది