క్లాస్‌ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్‌ అంతలోనే ఊహించని సంఘటన

Updated on: Sep 09, 2026 | 4:48 PM

కీసరలోని సెరినిటీ స్కూల్‌లో పదో తరగతి క్లాస్‌ జరుగుతుండగా మూడో అంతస్తులోని గదిలోకి నాగుపాము ప్రవేశించింది. పామును చూసిన విద్యార్థులు భయంతో కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. స్కూల్‌ యాజమాన్యం స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం అందించింది. అయితే ఆయన రావడంలో ఆలస్యం కావడంతో విద్యార్థులు బయటే ఉండిపోయారు. ఈ ఘటనపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పాఠశాలలో పాము కనిపించడం ఇది మూడోసారి అని ఆరోపించారు.

కీసరలోని సెరినిటీ స్కూల్‌లో పదోతరగతి విద్యార్ధులకు టీచర్‌ క్లాస్‌ తీసుకుంటున్నారు. విద్యార్ధులు పాఠాలు వినడంలో మునిగిపోయారు. ఇంతలో అక్కడ ఊహించని సంఘటన జరిగింది. అది చూసి టీచర్‌, విద్యార్ధులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విద్యార్ధులు భయంతో బయటకు పరుగులు తీశారు. టీచర్‌ స్కూల్ యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న యాజమాన్యం విద్యార్ధులకు ధైర్యం చెప్పారు. స్కూల్‌లోని మూడో అంతస్తులోని పదవ తరగతి గది ఉంది. ఆ గదిలోకి ఎవరూ ఊహించని విధంగా నాగుపాము ప్రవేశించడంతో విద్యార్థులు ఒక్కసారిగా భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. క్లాస్ జరుగుతున్న సమయంలోనే పాము ప్రత్యక్షం కావడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. పామును చూసి బెంబేలెత్తిన విద్యార్థులు గది నుంచి బయటకు పరుగులు పెట్టారు. స్కూల్ యాజమాన్యం వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించింది. అయితే స్నేక్‌ క్యాచర్‌ రావడానికి ఆలస్యం కావడంతో విద్యార్ధులంతా బయటే నిలబడ్డారు. ఈ విషయం తెలిసిన వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ వద్దకు చేరుకుని యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో నాగుపాము ప్రత్యక్షం కావడం ఇది మూడోసారి అని తల్లిదండ్రులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఫీజుల వసూలుపై ఉన్న శ్రద్ధ స్కూల్ పరిసరాల శుభ్రతపై, పిల్లల భద్రతపై ఉండాలని వారు హెచ్చరించారు. అరుదైన ఈ ఘటనతో స్థానికంగా పెద్ద ఎంట్రీ చర్చనీయాంశమైంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Snake in Bike: బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు

ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్‌ చేసిన పోలీసుల కళ్లు జిగేల్‌!

మెట్రోరైల్లో యాడ్‌ చూసి మహిళలు ఫైర్.. ఇంతకీ ఆ యాడ్‌లో ఏముందో తెలుసా!

300 ఏళ్ల తర్వాత రామప్ప ఆలయంలో అరుదైన ఘట్టం..

పోలేరమ్మ గుడిలో అద్భుతం.. అమ్మవారి విగ్రహంపై మరో రెండు కళ్లు ప్రత్యక్షం

Loading...
Unable to load recommendations.
Follow Us