ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

Updated on: Jan 23, 2026 | 12:53 PM

ఢిల్లీలోని AP భవన్‌లో జపాన్ రాయబార సిబ్బంది సంప్రదాయ ఆంధ్రా భోజనాన్ని ఆస్వాదించారు. ఘాటైన రుచులపై ప్రశంసలు కురిపించారు. సీఎం చంద్రబాబు స్పందిస్తూ, ఆంధ్రా వంటకాలు ఆప్యాయతను చాటుతాయని, జపాన్ అతిథులకు మరిన్ని రుచులు అందించడానికి స్వాగతం పలికారు. రాయబారి బిర్యానీని చేత్తో తినడం ప్రశంసించారు.

ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో జపాన్ రాయబార సిబ్బంది ఆంధ్రా భోజనాన్ని ఆస్వాదించారు. తెలుగువారి సంప్రదాయ వంటకాలు రుచిపై వారు ప్రశంసలు కురిపించారు. జపాన్ దౌత్యవేత్తల బృందం మంగళవారం ఏపీ భవన్‌లో టీమ్ లంచ్‌లో పాల్గొని, సంప్రదాయ ఆంధ్రా థాలీని రుచి చూసింది. ఈ అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ.. “మేము ఘాటైన రుచులతో కూడిన అద్భుతమైన, నిజమైన ఆంధ్రా థాలీని ఆస్వాదించాం. ధన్యవాదాలు!” అని పేర్కొంది. ఈ పోస్ట్‌పై సీఎం చంద్రబాబు స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. “మా సంప్రదాయ ఆహారాన్ని మీరు ఆస్వాదించడం చాలా సంతోషంగా ఉంది. జపాన్ వంటకాలైన సుషీ, సషిమి ఎలాగైతే ఆ దేశ సంస్కృతిలో కచ్చితత్వం, సమతుల్యతను ప్రతిబింబిస్తాయో, అలాగే ఆంధ్రా వంటకాలు తమ రుచుల ద్వారా ఆప్యాయతను, ఉదారతను చాటుతాయి” అని చంద్రబాబు పేర్కొన్నారు. అంతేకాకుండా, “మీ కోసం, జపాన్ నుంచి మా రాష్ట్రానికి వచ్చే అతిథుల కోసం ఇంకా ఎన్నో రుచులు వేచి ఉన్నాయి. మీ అందరికీ రెండో ఇల్లయిన ఆంధ్రప్రదేశ్‌కు స్వాగతం పలకడానికి మేం ఎదురుచూస్తున్నాం” అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. ఇక బిర్యానీ రుచి చూసిన రాయబారి కెయిచి చేతులతో భోజనం చేసే భారతీయ సంప్రదాయాన్ని ప్రశంసించారు. ఈ సందర్భంగా.. తమ భారతీయ స్నేహితులను అనుసరిస్తూ చేత్తో బిర్యానీ తినడానికి ప్రయత్నించానని, సుషీలాగా బిర్యానీ చేత్తో తింటే ఇంకా రుచిగా ఉంటుందంటూ.. ఢిల్లీలో బిర్యానీ తిన్న ఫోటోలను గతంలో ఓనో కెయిచీ ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డెలివరీ బాయ్‌గా మారిన ఎమ్మెల్యే.. ‘ఏ పనీ తక్కువ కాదన్న నేత’

బుర్ఖా ధరించి చైన్ స్నాచింగ్.. కట్ చేస్తే..

‘డిజిటల్ లంచం’.. ఇప్పుడు షాకింగ్ ట్రెండ్‌

పురుషుని కడుపులో గర్భాశయం.. రిపోర్టు చూసి అవాక్కైన వ్యక్తి.. అలా ఎలా మావా

అసలు మీరు ఐఏఎస్ కు ఎలా సెలక్టయ్యారు ?? విద్యార్థి ప్రశ్నకు.. కలెక్టర్ జవాబిది!