ఇదో ప్రపపంచ వింత.. కాదంటారా ?? ఛాలెంజ్‌.. వీడియో

|

Mar 10, 2022 | 9:50 AM

టెక్‌ దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఎంత బిజీగా ఉన్నా... తనదైన శైలిలో ఇటు సోషల్‌ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. అరుదైన విషయాలను ట్విట్టర్ వేదికగా అందరితో పంచుకుంటారు.

టెక్‌ దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఎంత బిజీగా ఉన్నా… తనదైన శైలిలో ఇటు సోషల్‌ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. అరుదైన విషయాలను ట్విట్టర్ వేదికగా అందరితో పంచుకుంటారు. తాజాగా ఆయన మరో అద్భుత విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేసారు. మిజోరంలోని ఒక మేఘాల జలపాతం వీడియోను పోస్ట్‌ చేశారు. ఐజ్వాల్ సమీపంలో మేఘాలు జలపాతం మాదిరిగా పర్వతాల నుంచి దిగువకు వేగంగా ప్రయాణిస్తున్న అద్భుత దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. దీన్ని మేఘాల జలపాతంగా పిలుస్తుంటారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. ఈ వీడియోను వీక్షిస్తున్న నెటిజన్లు అద్భుతం అంటున్నారు. ఈ వీడియోతో పాటు ఆనంద్ మహీంద్రా ఒక ట్వీట్ పెట్టారు. ‘‘ఐజ్వాల్. ఒక మేఘాల జలపాతం? ప్రపంచ వింతలలో ఇది కూడా ఒకటి.. కాదంటారా..? ప్రపంచం నలుమూలల నుంచి దీన్ని చూసేందుకు, ట్రెక్కింగ్ చేసేందుకు వస్తారని చాలెంజ్ చేస్తున్నా’’ అంటూ ట్వీట్‌ చేశారు.

Also Watch:

Viral Video: వేదికపైనే తన్నుకున్న వధూవరులు !! వీడియో

క్రికెట్‌లో కొత్త రూల్స్‌.. ఆ పని చేస్తే మూల్యం తప్పదు.. వీడియో

విడాకులు తీసుకున్న స్టార్ డైరెక్టర్.. 18 ఏళ్ళ వివాహ బంధానికి ముగింపు !! వీడియో

AP Movie Ticket Rates Fixed : థియేటర్ రేట్లు పెంచాం.. కాని కండీషన్ అప్లై !! వీడియో

Viral Video: నెమలి-మేక మధ్య హోరాహోరి పోరు !! వీడియో