బెలూన్‌తో పాటు ఎగిరిన రైతు !! గాల్లోనే రెండు రోజులు.. చివరికి ??

|

Sep 14, 2022 | 8:51 PM

ఓ వ్యక్తి రెండు రోజులు గాల్లోనే గడిపాడు.. హైడ్రోజన్ బెలూన్ సహాయంతో పండ్లు కోస్తుండగా.. బెలున్ తాడు తెగిపోయింది. దీంతో అతను వందలాది కిలోమీటర్లు బెలున్‌తో పాటు ప్రయాణించాడు.

ఓ వ్యక్తి రెండు రోజులు గాల్లోనే గడిపాడు.. హైడ్రోజన్ బెలూన్ సహాయంతో పండ్లు కోస్తుండగా.. బెలున్ తాడు తెగిపోయింది. దీంతో అతను వందలాది కిలోమీటర్లు బెలున్‌తో పాటు ప్రయాణించాడు. చివరకు సురక్షితంగా కిందకు దిగాడు. ఈ షాకింగ్ ఘటన చైనాలో చోటుచేసుకుంది. హైడ్రోజన్ బెలున్ సహాయంతో 40 ఏళ్ల హు తో పాటు మరో వ్యక్తి పైన్ గింజలను సేకరిస్తున్నారు. ఈ సమయంలో బెలూన్ తాడు తెగింది. ఒకరు కిందకు దూకగా.. హూ దానిలోనే చిక్కుకుపోయాడు. అయితే.. దూకిన వ్యక్తి ఇచ్చిన సమాచారంతో బెలూన్ తోపాటు అదృశ్యమైన హు కోసం గాలించారు. అయితే.. అతని దగ్గర సెల్‌ఫోన్ ఉంది. మరుసటి రోజు సెల్‌ఫోన్ సిగ్నల్స్ కలవడంతో అధికారులు అతనిని సంప్రదించారు. సురక్షితంగా ల్యాండ్ కావడానికి పలు సూచనలు చేశారు. బెలూన్‌ నుంచి నెమ్మదిగా గాలిని తగ్గించమని చెప్పారు. వారి సలహాలతో హు.. రష్యా సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఫాంగ్‌జెంగ్ ప్రాంతంలో భూమి మీదకు చేరాడు. ఈశాన్య దిశగా 320 కిలోమీటర్లు గాలిలో ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. అతను భూమిని చేరుకోవడానికి మరో రోజు పట్టిందన్నారు. అయితే.. హు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడని.. గాలిలో నిలబడి ఉండటంతో వెన్నునొప్పితో బాధపడుతున్నాడని తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెంపుడు కుక్క దాడిలో.. బాలుడిపై మొహంపై 200 కుట్లు

Traffic Challan: ఇదేం ఫైన్ మావ.. చలాన్ చూసి స్టన్ అయిన వాహనదారుడు !!

స్కూలుకి లేట్‌గా వచ్చారని టాయ్‌లెట్స్‌ కడిగించిన ప్రిన్సిపల్‌ !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

అమ్మబాబోయ్.. పిడుగు పడటాన్ని కళ్లారా ఎప్పుడైనా చూశారా ?? వీడియో చూస్తే గుండె గల్లంతే

Digital News Round Up: ఊపేస్తున్న తార్‌మార్‌ సాంగ్‌ | రష్మికను దించేసిన చిన్నారి..లైవ్ వీడియో

 

Follow us on