అమ్మబాబోయ్.. పిడుగు పడటాన్ని కళ్లారా ఎప్పుడైనా చూశారా ?? వీడియో చూస్తే గుండె గల్లంతే

అమ్మబాబోయ్.. పిడుగు పడటాన్ని కళ్లారా ఎప్పుడైనా చూశారా ?? వీడియో చూస్తే గుండె గల్లంతే

Phani CH

|

Updated on: Sep 14, 2022 | 9:22 PM

దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు నగరాలు జలమయంగా మారాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర రాజధాని ముంబై మహా నగరంలో సెప్టెంబర్‌ 8 సాయంత్రం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది.

దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు నగరాలు జలమయంగా మారాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర రాజధాని ముంబై మహా నగరంలో సెప్టెంబర్‌ 8 సాయంత్రం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. సెప్టెంబర్‌ 7 నుంచి మర్నాడు ఉదయం 8 గంటల వరకు 24 గంటల వ్యవధిలో 30.96 మి.మీ వర్షపాతం నమోదైంది. దీంతో జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ముంబై నగరంలో పిడుగు పడుతున్న దృశ్యం నెట్టింట వైరల్ అయింది. ఓ భవనంపై పిడుగు పడుతుండగా.. ఒకరు సెల్‌ఫోన్‌లో రికార్డు చేశారు. అనంతరం ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు భయానకంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Digital News Round Up: ఊపేస్తున్న తార్‌మార్‌ సాంగ్‌ | రష్మికను దించేసిన చిన్నారి..లైవ్ వీడియో

TOP 9 ET News: స్పై యాక్షన్ డ్రామా ది ఘోస్ట్ 12 యాక్షన్ సీన్స్ |పొన్నియన్ సెల్వన్ నుంచి సాంగ్ విడుదల

Published on: Sep 14, 2022 08:43 PM