బ్యాంకులో డబ్బు కొల్లగొట్టి పారిపోయిన చిన్నారులు !! చివరికి ??

|

Mar 26, 2024 | 8:41 PM

నకిలీ పిస్తోళ్లతో దొంగ, పోలీసు ఆడే వయసున్న ముగ్గురు పిల్లలు బ్యాంకు దోపిడీకి పాల్పడ్డారు. పిల్లల వయస్సు కేవలం 11, 12, 16 ఏళ్లేనని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. అమెరికాలోని టెక్సాస్‌లో ఈ వింత కేసు వెలుగు చూసింది. ఆడిటీ సెంట్రల్ నివేదిక ప్రకారం ముగ్గురు బాలురు కలిసి టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లోని స్థానిక బ్యాంకును దోచుకున్నారు. మార్చి 14న వెల్స్ ఫార్గో బ్యాంక్‌కు వెళ్లి క్యాషియర్‌కు బెదిరింపు నోట్ ఇచ్చారని పోలీసులు తెలిపారు.

నకిలీ పిస్తోళ్లతో దొంగ, పోలీసు ఆడే వయసున్న ముగ్గురు పిల్లలు బ్యాంకు దోపిడీకి పాల్పడ్డారు. పిల్లల వయస్సు కేవలం 11, 12, 16 ఏళ్లేనని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. అమెరికాలోని టెక్సాస్‌లో ఈ వింత కేసు వెలుగు చూసింది. ఆడిటీ సెంట్రల్ నివేదిక ప్రకారం ముగ్గురు బాలురు కలిసి టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లోని స్థానిక బ్యాంకును దోచుకున్నారు. మార్చి 14న వెల్స్ ఫార్గో బ్యాంక్‌కు వెళ్లి క్యాషియర్‌కు బెదిరింపు నోట్ ఇచ్చారని పోలీసులు తెలిపారు. తరువాత వారు బ్యాంకులోని డబ్బు కొల్లగొట్టి, అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు సీసీటీవీని పరిశీలించగా చిన్నారులు బ్యాంకు దోపిడీకి పాల్పడ్డారని తెలిసి ఆశ్చర్యపోయారు. రిటైర్డ్ జువెనైల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి మైక్ ష్నైడర్ మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి కేసును చూడటం ఇదే మొదటిసారన్నారు. హారిస్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం వివరాల ప్రకారం చిన్నారులు దోపిడీకి పాల్పడిన సమయంలో క్యాషియర్‌కు తుపాకీ చూపించలేదు. అయితే వారు తమ వద్ద ఆయుధం ఉందని పేర్కొంటూ క్యాషియర్‌కు బెదిరింపు నోట్‌ ఇచ్చారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Velliangiri Mountains: కొండలు దాటి శివయ్యను దర్శించుకునే సాహస యాత్ర

Irfan Pathan: హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై ఇర్ఫాన్ పఠాన్ సంచలన వ్యాఖ్యలు

మగువలుగా మారిన మగవారు.. రతీ మన్మధులకు పూజలు

మెదడు చురుకుగా పనిచేయడానికి అద్భుత ఆహారాలు

చైనా ఆయిల్‌ ట్యాంకర్‌పై 5 బాలిస్టిక్‌ క్షిపణులు ప్రయోగం

 

Follow us on