Gas Geyser Tips: గ్యాస్‌ గీజర్‌ వాడుతున్నారా.? ఈ తప్పులు చేస్తే ప్రాణాలే పోతాయ్.!

|

Jul 29, 2024 | 9:30 AM

ప్రస్తుత కాలంలో చాలా మంది ఇంట్లో వేడి నీళ్ల కోసం గీజర్‌లను వాడుతున్నారు. అయితే, కొంత మంది కరెంట్‌ అవసరం లేకుండా.. తక్కువ ఖర్చుతో పని చేసే గ్యాస్‌ గీజర్‌లను ఉపయోగిస్తుంటారు. ఈ గీజర్​ను సక్రమంగా వాడకపోతే.. ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్​ సనత్​నగర్​లో గ్యాస్‌ గీజర్‌ని ఉపయోగించిన వారి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.

ప్రస్తుత కాలంలో చాలా మంది ఇంట్లో వేడి నీళ్ల కోసం గీజర్‌లను వాడుతున్నారు. అయితే, కొంత మంది కరెంట్‌ అవసరం లేకుండా.. తక్కువ ఖర్చుతో పని చేసే గ్యాస్‌ గీజర్‌లను ఉపయోగిస్తుంటారు. ఈ గీజర్​ను సక్రమంగా వాడకపోతే.. ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్​ సనత్​నగర్​లో గ్యాస్‌ గీజర్‌ని ఉపయోగించిన వారి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. గ్యాస్‌ గీజర్‌ నుంచి విడుదలైన కార్బన్‌ మోనాక్సైడ్‌ విష వాయువును పీల్చడంతో తల్లి, తండ్రి, కుమారుడు మృతి చెందారు. ఈ వాయువును పీల్చడం ద్వారా తలనొప్పి, వికారం, వాంతులు, అలసట, తలతిప్పడం, గందరగోళం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎక్కువ సేపు దీనిని పీలిస్తే.. ఏకంగా ప్రాణాలే పోవచ్చు. అందుకే గ్యాస్‌ గీజర్‌ వాడేవారు అలర్ట్‌గా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

వాడేవారి బాత్‌రూమ్‌లో వెంటిలేషన్‌ కాస్త పెద్దగా ఉండాలి. ఎందుకంటే.. గీజర్‌ నుంచి ఏవైనా విషపూరిత గ్యాస్‌లు లీకైతే.. త్వరగా బయటకు వెళ్లిపోతాయి. గ్యాస్ గీజర్‌ను వెంటిలేషన్‌ లేని బాత్రూమ్‌లో ఇన్‌స్టాల్ చేయవద్దు. అలాగే గ్యాస్‌ గీజర్‌లను వాడేవారు ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌ తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలి. గీజర్ ఆన్‌లో ఉన్నప్పుడు ఫ్యాన్‌ కూడా ఆన్‌లోనే ఉండాలి. దీనివల్ల విడుదలైన వాయువులు బయటకు వెళ్లిపోతాయి. కొంతమంది గీజర్‌లను ఆఫ్‌ చేయడం మర్చిపోతుంటారు. కానీ, ఇలా అస్సలు చేయకూడదు. గీజర్‌ వాడిన తర్వాత బంద్‌ చేయాలి. బాత్‌రూమ్‌లో స్నానం చేస్తున్నప్పుడు ఊపిరి పీల్చడానికి ఏమాత్రం అసౌకర్యంగా ఉన్నా కూడా.. వెంటనే బయటకు వచ్చేయండి. ఆ తర్వాత మంచి టెక్నీషియన్‌తో రిపేర్‌ చేయించాలి. కొత్తగా గ్యాస్‌ గీజర్‌లను కొనుగోలు చేసేవారు మంచి రేటింగ్ ఉన్నవాటిని ఎంపిక చేసుకోండి. ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల చాలా వరకు గ్యాస్‌ గీజర్‌ ద్వారా జరిగే ప్రమాదాలను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on