యముడు షార్ట్ బ్రేక్‌.. తీసుకున్నాడనుకుంటా !!

|

Nov 17, 2024 | 11:22 AM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. మనదేశంలో రోడ్డు ప్రమాదాలు నానాటికి పెరిగిపోతున్నాయి. ఏటా ఎంతో మంది రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అలాంటి ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట ఎన్నో చూస్తుంటాం. ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

రోడ్డు క్రాస్ చేస్తున్న బైక్ ను.. స్పీడుగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో బైక్ మీద ఉన్న ఆ వ్యక్తి ఎగిరి పడ్డాడు. ఆ తర్వాత కారు పల్టీలు కొడుతూ దూసుకెళ్లి రోడ్డు పక్కన ఉన్న మట్టి దిబ్బను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదం.. దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు తాలూకాలోని కంబాలబెట్టు వద్ద జరిగింది. బైక్, కారు మధ్య జరిగిన ఘోర ప్రమాదంలో అదృష్టవశాత్తూ అటు బైకర్, ఇటు కారు డ్రైవర్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. లోపలి రోడ్డు నుంచి మెయిన్ రోడ్డుపైకి బైక్ వస్తుండగా.. అదే సమయంలో వేగంగా వచ్చిన కారు డ్రైవర్.. బైక్‌ను ఢీకొట్టకుండా తప్పించే ప్రయత్నం చేశాడు. అయినా.. ఫలితం లేకపోయింది. ఈ క్రమంలోనే బైకర్ ను ఢీకొట్టిన కారు అదుపు తప్పింది. అక్కడే ఆగి ఉన్న మరో బైక్‌ను ఢీకొని బోల్తా పడింది. తరువాత, అది ఒక మట్టి దిబ్బ మీద పడిపోయింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ సనత్ పావాడ సురక్షితంగా బయటపడగా, బైక్ రైడర్ యతీష్‌కు గాయాలయ్యాయి. అతడిని చికిత్స కోసం పుత్తూరులోని ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒరేయ్ ఎవర్రా మీరు ?? బిజినెస్ కోసం సల్మాన్ ఖాన్ ను ఇలా కూడా వాడేస్తారా ??

విదేశాల్లో ఉండే పాము.. వైజాగ్ ఎలా వచ్చింది ??

కంటెంట్ ఉంటే కోట్లు.. లేదంటే పాట్లు.. చిన్న సినిమాలపై చిరు

తంతే బకెట్ బిర్యానీలో పడ్డారు.. కోటీశ్వరులైన 500 మంది ఉద్యోగులు

పగలేమో పనోళ్లు.. రాత్రయితే ఆయుధ వ్యాపారులు