Viral Video : అరుదైన రికార్డ్ సృష్టించిన బీఎస్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్.. ఏంచేశారంటే.. వైరల్ వీడియో.
సాధారణంగా పోలీసులు, సైనికులు ఎప్పుడూ స్టంట్స్ చేస్తూనే ఉంటారు. నిత్యం సాహసాలతోనే వారి జీవనం సాగుతుంది. అయితే
సాధారణంగా పోలీసులు, సైనికులు ఎప్పుడూ స్టంట్స్ చేస్తూనే ఉంటారు. నిత్యం సాహసాలతోనే వారి జీవనం సాగుతుంది. అయితే ఇటీవల చాలామంది సోషల్‌మీడియాలో పాపులర్ అవ్వాలని సాధారణ పీపుల్ బైక్ స్టంట్స్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట చాలానే దర్శనమిస్తుంటాయి. కానీ ఒక సైనికాధికారి అద్భుతమైన స్టంట్ చేసి అరుదైన రికార్డ్ నెలకొల్పారు. అవును.. దిల్లీలోని గోలాధర్ మైదానంలో బీఎస్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్ విశ్వజీత్ భాటియా.. రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 సీసీ మోటార్‌సైకిల్‌ను ఫుట్‌రెస్ట్‌పై నిలబడి నడిపించారు. అదికూడా ఏకంగా 100 కిలోమీటర్ల పాటు ఆగకుండా చక్కర్లు కొట్టారు. ఈ స్టంట్ మొత్తం 2 గంటల 38 నిమిషాల 23 సెకన్ల పాటు సాగింది. అద్భుతమైన స్టంట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Published on: Jan 08, 2023 09:55 AM