Lottery: సాలీడు తెచ్చిన అదృష్టం.. బంపర్ లాటరీ కొట్టేసిన మహిళ 30 ఏళ్లపాటు నెలకు ఏంటంటే.?
అదృష్టం ఎప్పుడు ఎవర్ని ఎలా వరిస్తుందో చెప్పలేం. సహజంగానే మనుషులకు కొన్ని నమ్మకాలుంటాయి. అది ఎంతవరకూ నిజమవుతాయో తెలియదు గానీ.. ఇక్కడ ఓ మహిళకు మాత్రం నిజమైందని చెబుతోంది. తన పుట్టినరోజున ఓ లాటరీ టికెట్టుకొన్న ఆమెకు బంపర్ లాటరీ దక్కింది. నెలకు రూ.10 లక్షల చొప్పున 30 ఏళ్ల పాటు ఆదాయం వచ్చేలా ఆమె లాటరీ గెలుచుకుంది. ఈ లాటరీ తనకు ఆ సాలీడువల్లే దక్కిందని భావిస్తున్నారు..
అదృష్టం ఎప్పుడు ఎవర్ని ఎలా వరిస్తుందో చెప్పలేం. సహజంగానే మనుషులకు కొన్ని నమ్మకాలుంటాయి. అది ఎంతవరకూ నిజమవుతాయో తెలియదు గానీ.. ఇక్కడ ఓ మహిళకు మాత్రం నిజమైందని చెబుతోంది. తన పుట్టినరోజున ఓ లాటరీ టికెట్టుకొన్న ఆమెకు బంపర్ లాటరీ దక్కింది. నెలకు రూ.10 లక్షల చొప్పున 30 ఏళ్ల పాటు ఆదాయం వచ్చేలా ఆమె లాటరీ గెలుచుకుంది. ఈ లాటరీ తనకు ఆ సాలీడువల్లే దక్కిందని భావిస్తున్నారు ఆ కుటుంబసభ్యులు.ఈ ఘటన ఇంగ్లండ్‌లో చోటుచేసుకుంది. ఇంగ్లండ్‌లోని డోర్కింగ్‌కు చెందిన 70 ఏళ్ల మహిళ డోరిస్ స్టాన్‌బ్రిడ్జ్ ఇటీవలే తన పుట్టిన రోజు జరుపుకుంది. ఈ క్రమంలో ఆమెకు తన ఇంటి ఎదురుగా పచ్చికపై మనీ స్పైడర్ అనే సాలీడు కనిపించింది. అది కనిపిస్తే ఆర్థికంగా లాభం చేకూరుతుందని అక్కడి వారి నమ్మకం. దీంతో, ఆమె ఆ రోజున లాటరీ టిక్కెట్టు కొనుగోలు చేసింది. ఆ తరువాత కొన్ని రోజులకు లాటరీ సంస్థ వారు డోరిస్‌ను ఈ-మెయిల్ ద్వారా సంప్రదించారు. ఆమె టిక్కెట్టు నెంబర్‌పై బంపర్ లాటరీ తగిలిందని, 30 ఏళ్ల పాటు నెలకు 10 లక్షల చొప్పున ఆమెకు ఆదాయం వస్తుందని చెప్పారు. దీంతో, డోరిస్ ఆనందానికి అంతేలేకుండా పోయింది. ఇప్పుడు తనకు వందేళ్లు బతకాలనిపిస్తోందని స్థానిక మీడియాతో చెప్పింది. తన బంధువులందరినీ తీసుకుని విదేశీ టూర్ ప్లాన్ చేస్తున్నానని, గ్రామీణ ప్రాంతంలో ప్రకృతి సౌందర్యం తొణికిసలాడే చోట ఓ భారీ బంగళా కొనే యోచనలో ఉన్నానని కూడా ఆమె చెప్పుకొచ్చింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..