బర్త్‌డే పార్టీలో కేకుపై క్యాండిల్‌ వెలిగించిన యువతి.. క్షణాల్లో

Updated on: Feb 23, 2025 | 9:14 PM

ప్రస్తుతకాలంలో రీల్స్‌ పిచ్చి బాగా పెరిగిపోయింది. వయసుతో సంబంధం లేకుండా చిన్నా, పెద్దా అందరూ రీల్స్‌లో ఇంటర్నెట్‌ను హోరెత్తిస్తున్నారు. ఈ రీల్స్‌ మోజులో ఒక్కోసారి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే జరిగింది ఓ బర్త్‌డే పార్టీలో. బర్త్‌డే కేకు బాంబులా పేలడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో ఓ చోట బర్త్‌డే పార్టీ జరుగుతోంది. ఫ్రెండ్స్‌, బంధువుల అంతా చేరి కేక్‌ కటింగ్‌ కోసం నిలబడ్డారు. వారి ముందు కట్‌ చేసేందుకు ఒక కేక్ రెడీగా ఉంది. కేక్ పైన తామరపువ్వు ఆకారంలో ఉన్న క్యాండిల్‌ కూడా ఏర్పాటు చేశారు. బర్త్‌డే జరుపుకునే అమ్మాయి కేకుపై ఉన్న క్యాండిల్‌ను వెలిగించి, భయం భయంగా వెనక్కి అడుగులు వేసింది. అప్పటికే అక్కడ బర్త్‌డే జరుగుతున్న ఆ అమ్మాయి క్యాండిల్‌ వెలిగించి భయంతో వెనక్కి అడుగులు వేస్తుంది. క్యాండిల్‌ సురక్షితంగానే వెలిగింది.. కానీ, ఆ మరుక్షణంలోనే ఎవరూ ఊహించని విధంగా కేకు బాంబులా పేలిపోయి చెల్లాచెదురుగా పడిపోయింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే రూ.10 లక్షలు.. పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్‌

వీళ్ల కరెంట్ బిల్‌తో.. విల్లా కొనేయొచ్చు !! షాకిస్తున్న హీరోల కరెంట్‌ బిల్

మరో గుడ్ న్యూస్ చెప్పనున్న అక్కినేని ఫ్యామిలీ..

Monalisa: మోనాలిసా గొప్ప మనసుకు జనం ఫిదా..

ప్రతిరోజూ పెరుగు తీసుకుంటే జరిగేది ఇదే