Pre Wedding Shoot: ప్రీ వెడ్డింగ్‌ షూట్‌లో నిప్పంటించుకున్న వధూవరులు.. వైరల్‌ అవుతున్న షాకింగ్‌ వీడియో

|

May 20, 2022 | 9:15 AM

ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్.. ఇప్పుడు ఇదే ట్రెండ్.. పెళ్లికి ముందు వధూవరులు అందమైన లొకేషన్లలో ఫోటోషూట్ చేసుకుంటుంటారు. ఈ ఫోటోషూట్స్ వెర్రిలో పడి కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.


ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్.. ఇప్పుడు ఇదే ట్రెండ్.. పెళ్లికి ముందు వధూవరులు అందమైన లొకేషన్లలో ఫోటోషూట్ చేసుకుంటుంటారు. ఈ ఫోటోషూట్స్ వెర్రిలో పడి కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రమాదకరమైన స్టంట్స్‏తో ఫోటోషూట్స్ చేస్తుంటారు. తాజాగా ఓ వధూవరులు ప్రీ వెడ్డింగ్‌ ఫోటోషూట్ పేరుతో వారికి వారే నిప్పంటించుకుని పరిగెత్తారు.. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో మొదట వధువు ఓచేత్తో పూలబొకేలాంటిది పట్టుకొని, మరో చేత్తో వరుడిని పట్టుకుని ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని నడుస్తున్నారు. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి వధువు చేతిలోని బొకేకి నిప్పు అంటించాడు. ఆ తర్వాత వధూవరులిద్దరికీ నిప్పు అంటుకుంది. వెంటనే వారిద్దరూ పరుగందుకున్నారు. వారికి ఎదురుగా ఫోటోగ్రాఫర్ ఫోటోస్‌ తీస్తున్నాడు. కాస్త దూరం పరిగెత్తిన తర్వాత ఇద్దరు నేలపై పడిపోయారు. మరో ఇద్దరు వ్యక్తులు వచ్చి మంటలను ఆర్పేశారు. ఈ వీడియోను ఫేమస్ డీజే, వెడ్డింగ్ ఫోటో గ్రాఫర్ అయిన రస్ పావెల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దానికి ఇద్దరు స్టంట్ వర్కర్స్ పెళ్లి చేసుకుంటే అనే క్యాప్షన్ ఇచ్చారు. అంతేకాదు.. వధూవరుల ఫోటో షూట్ నిపుణుల పర్యవేక్షణలో జరిగిందని.. వారి శరీరాలకు యాంటీ బర్న్ జెల్ ఉందని..అలాగే వధువు జుట్టు పై విగ్ అమర్చినట్లు చెప్పుకొచ్చాడు.. వధూవరులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని.. ఈ స్టంట్ ఎవరు ప్రయత్నించవద్దని తెలిపాడు.. ప్రస్తుతం వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Gold in Sea: బీచ్‌లో బంగారం దొరుకుతుందట..! సముద్ర తీరానికి ఎగబడ్డ జనం..!

Electrician Love: అబ్భా ప్రేమ ఎంత పనైనా చేయిస్తుంది అంటే ఇదే మరి..! గర్ల్‌ ఫ్రెండ్‌ కోసం ఎలక్ట్రీషియన్ వింత పని..!

Viral Video: దాని కోసం ఇలా చేస్తారా..? భర్త ఇంట్లో బాత్ రూమ్ లేదని భార్య ఆత్మహత్య..!

Published on: May 20, 2022 09:15 AM