ముద్దులొలికే ఈ చిన్నారి ఫోటో వెనుక.. అంతులేని విషాదం వీడియో

Updated on: Jul 09, 2025 | 1:17 PM

ఇద్దరు పిల్లలతో నిండుగా కళకళలాడుతున్న ఆ పచ్చని సంసారంలో కుటుంబ కలహాలు నిప్పు రాజేసాయి. క్షణికావేశంలో కుటుంబ పెద్ద తీసుకున్న నిర్ణయం స్థానికులకు తీరని ఆవేదనను మిగిల్చింది. రాజస్థాన్‌లోని బార్మర్‌లో ఈ విషాద ఘటన జరిగింది. బార్మర్‌కు చెందిన కవిత తన చిన్న కుమారుడు రామ్‌దేవ్‌కు బాలికల దుస్తులు ధరించి, కళ్లకు కాజల్ పెట్టి, బంగారు ఆభరణాలు వేసి, చూడముచ్చటగా తయారుచేసింది. ఆ తరువాత వారి కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంది.

ఆ ఇంటిలోని భర్త, భార్య ఇద్దరు కుమారులు ఇంటికి సమీపంలో ఉన్న నీటి ట్యాంక్‌లోకి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులను శివలాల్‌ మేఘ్వాల్‌, అతని భార్య కవిత కుమారులు బజరంగ్ రామ్‌దేవ్‌లు గా పోలీసులు గుర్తించారు. శివలాల్‌ మేఘ్వాల్‌ కుటుంబ సభ్యుల మృతదేహాలను వారి బంధువుల సమక్షంలో వాటర్‌ ట్యాంక్ నుంచి వెలికితీశారు. శివలాల్‌ మేఘ్వాల్‌ కుటుంబం సామూహిక ఆత్మహత్య వెనుకగల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శివలాల్‌ మేఘ్వాల్‌ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్‌లో తమ నిర్ణయానికి ముగ్గురు వ్యక్తులు కారకులని, వారిలో తన సోదరుడు ఒకరని రాసివుంది. కుటుంబ సభ్యుల మధ్య భూ వివాదం సంవత్సరాల తరబడి నడుస్తుందని లేఖలో బయటపడినట్లు డీఎస్‌పీ మనారామ్‌ గార్గ్ మీడియాకు తెలిపారు. శివలాల్‌ మేఘ్వాల్‌.. కేంద్ర ప్రభుత్వం అందించిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద మంజూరైన నిధులను ఉపయోగించి ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు. అయితే అందుకు అతని తల్లి, సోదరుడి నుంచి వ్యతిరేకత ఎదురైందని నిత్యం వారి వేధింపులు తట్టుకోలేకే ఈ నిర్ణయానికి వచ్చారని చెప్పారు.

మరిన్ని వీడియోల కోసం :

కస్టమ్స్‌ చేతికి చిక్కిన 16 అరుదైన పాములు వీడియో

సారీ నాన్న.. ఇక భరించలేను..! పెళ్లైన 2 నెలలకే నవ వధువు సూ*సైడ్ వీడియో

మా అమ్మ చనిపోదామంటోంది… ఆదుకోండి కలెక్టర్‌కు బాలుడు విజ్ఞప్తి వీడియో