మీరు నల్లని పాలు ఎప్పుడైనా తాగారా? పోనీ చూశారా?
అదేంటి పాలు ఏవైనా తెల్లగా ఉంటాయి.. లేదంటే లేత పసుపు రంగులో ఉంటాయి.. అంతేకానీ ఈ నల్లని పాలేంటి..! అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే.. నల్లని పాలగురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఈ నల్లని పాలు కూడా ఆవుపాలలో ఉండే ఔషధగుణాలే కలిగి ఉంటాయట. అయితే ఈ నల్లని పాలు ఏ జంతువునుంచి లభిస్తాయో తెలుసా? ప్రతి ఇంట్లో రోజువారీ ఆహారం పాలు.
పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరికీ కావల్సిన అనేక పోషకాలు పాలులో నిండి ఉన్నాయి. ఆవులు, గేదెలు, మేకలు వంటి జంతువుల పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకుంటే అనేక సమస్యలు దూరమవుతాయి. ప్రతి ఒక్కరూ తెలుపు , లేత పసుపు పాలను చూసి ఉంటారు. ఆఫ్రికాలో కనిపించే నల్ల ఖడ్గమృగాలు నల్లని పాలను ఇస్తాయి. వినడానికి విచిత్రంగా అనిపించినా ఇది నిజం. నల్ల ఖడ్గమృగాలు క్షీరదాలే. కానీ వాటి పాలు చిక్కగా ఉండవు. ఎందుకంటే ఇందులో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. బ్లాక్ రినో పాలలో కొవ్వు లేకపోవడంతో పునరుత్పత్తి చక్రం నెమ్మదిగా ఉంటుంది. రినోలు దాదాపు 14 నుంచి 15 నెలల గర్భం దాల్చుతాయి. నల్ల ఖడ్గమృగం పాలలో దాదాపు ఆవు పాలతో సమానమైన పోషకాలు ఉంటాయి. ఇవి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు. అయితే ఇందులో బయోటిన్, నికోటినిక్ యాసిడ్ తక్కువగా ఉంటుంది. ఈ నల్లటి పాలను తరుచు తాగితే దృడంగా ఉంటారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: