తెలివిగా ఫోను కొట్టేద్దామనుకున్నాడు.. అందుకే చుక్కలు చూపించారు!
బిహార్‌లోని భాగల్పుర్ జిల్లా శివనారాయణ్పుర్ రైల్వే స్టేషన్లో మొబైల్ ఫోన్ చోరీకి ప్రయత్నించిన ఓ వ్యక్తికి ప్రయాణికులు షాక్ ఇచ్చారు. రైలు నెమ్మదిగా కదులుతుండగా కిటికీ పక్కన కూర్చున్న ప్రయాణికుడి ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన ప్రయాణికులు అతడి చేతులను గట్టిగా పట్టుకోవడంతో కిటికీ బయట వేలాడుతూ కొంతదూరం వెళ్లాడు. చివరకు ప్లాట్‌ఫాంపై పడిపోయిన అతడిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నట్లు కథనం పేర్కొంది.
రైల్వే స్టేషన్లో ప్రయాణికుల అజాగ్రత్తను ఆసరాగా చేసుకుని వారి వస్తువులను కొట్టేస్తుంటారు దొంగలు. తాజాగా ఓ దొంగ రైల్లో కిటికీ దగ్గర కూర్చున్న ప్రయాణికుల సెల్‌ఫోన్ కొట్టేయడానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడు. రైలు బయల్దేరుతున్న సమయంలో కిటికీ నుంచి ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించిన ఆ దొంగకు ప్రయాణికులు చుక్కలు చూపించిన ఘటన బిహార్‌లో వెలుగుచూసింది. బిహార్‌లోని భాగల్పుర్ జిల్లా శివనారాయణ్పుర్ రైల్వేస్టేషన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్లాట్‌ఫాంపై నిల్చున్న ఓ దొంగ.. రైలు నెమ్మదిగా బయలుదేరుతుండగా కిటికీ పక్కన ఉన్న ప్రయాణికుడి ఫోన్‌ను లాక్కునేందుకు ప్రయత్నించాడు. అయితే వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు అతడి చేతులను లోపలి నుంచి గట్టిగా పట్టుకున్నారు. రైలు ముందుకు కదులుతున్నప్పటికీ ప్రయాణికులు అతడిని వదలకుండా అలాగే పట్టుకున్నారు. దీంతో తప్పించుకునే మార్గం లేక ఆ దొంగ విలవిలలాడుతూ కిటికీ బయట నుంచి వేలాడుతూనే కొంతదూరం వెళ్లాడు. చివరకు పట్టుతప్పి ప్లాట్‌ఫాంపైనే పడిపోయాడు. ప్రయాణికుల దెబ్బకు ప్లాట్‌ఫాంపై పడిపోయిన ఆ వ్యక్తిని గమనించిన రైల్వే భద్రతా సిబ్బంది వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nagarjuna: దసరాకు ధమాకా.. ‘కింగ్ 100’ నుంచి దిమ్మతిరిగే సర్ప్రైజ్
అత్తామామలతో కలిసి.. CM విజయ్ను తన పెళ్లికి ఆహ్వానించిన అనిరుధ్
5నిమిషాలు కనిపించినందుకే.. హృతిక్‌కి భారీ రెమ్యునరేషన్!
