ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్‌ చేసిన పోలీసుల కళ్లు జిగేల్‌!

Updated on: Sep 09, 2026 | 5:43 PM

చెన్నై మెట్రో రైళ్లలో ప్రదర్శించిన ఓ ఎఫ్‌డీ ప్రకటన తీవ్ర వివాదానికి దారితీసింది. గర్ల్‌ఫ్రెండ్‌ ప్రేమను ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వడ్డీతో పోలుస్తూ రూపొందించిన పోస్టర్‌పై మహిళలను కించపరిచేలా ఉందంటూ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకే, సీపీఎం నేతలు ప్రకటనను తీవ్రంగా ఖండించారు. పోస్టర్లను వెంటనే తొలగించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రజా రవాణా వ్యవస్థల్లో ప్రకటనలపై కఠిన పర్యవేక్షణ అవసరమని కోరుతున్నారు.

బీహార్‌లో మద్యం అక్రమ రవాణా యదేచ్ఛగా సాగుతోంది అనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఓ రైల్లోని ఏసీ కోచ్‌లో మహిళా ప్రయాణికురాలి వద్ద పెద్దమొత్తంలో మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టిన పోలీసులు మహిళను అరెస్ట్‌ చేసి 75 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో విశేషమేంటంటే.. బీహార్‌లో మద్యనిషేధం అమలులో ఉంది. ఈ క్రమంలో ఈ అక్రమ మద్యం రవాణా వెలుగులోకి వచ్చింది. న్యూఢిల్లీ నుంచి జయనగర్ వెళ్తున్న ‘స్వాతంత్ర్య సేనాని ఎక్స్‌ప్రెస్’ రైలులోని ‘హెచ్-1 ఫస్ట్ క్లాస్ ఏసీ’ కోచ్‌లో ఓ మహిళ భారీగా మద్యాన్ని తరలిస్తున్నట్లు రైల్వే పోలీసులకు పక్కా సమాచారం అదంది. దీంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు, సీఐబీ సంయుక్త బృందాలు రంగంలోకి దిగాయి. రైలు సమస్తిపూర్ స్టేషన్‌కు చేరుకోగానే తనిఖీలు చేపట్టాయి. ఆ కోచ్‌లో ప్రయాణిస్తున్న నేహా కుమారి అలియాస్ నేహా ఝా లగేజ్‌ను పరిశీలించిన అధికారులు అవాక్కయ్యారు. ఆమె బ్యాగులు, బ్రీఫ్‌కేస్‌ల నుంచి వివిధ బ్రాండ్లకు చెందిన సుమారు 75 లీటర్ల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, ఆమెను అరెస్ట్ చేశారు. దర్భంగాలో నివసించే నేహా కుటుంబ నేపథ్యంపై పోలీసులు ఆరా తీశారు. ఆమె తండ్రి పంకజ్ కుమార్ ఝా రెండేళ్ల కిందట మద్యం కేసులో అరెస్టవ్వగా, సోదరిపై కూడా ఇలాంటి కేసే ఉంది. అయితే నేహాపై ఇప్పటివరకు ఎలాంటి కేసులు లేవని తేలింది. వైద్యులు, ప్రముఖులతో ఆమెకు సంబంధాలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. వారికి ఈ మద్యాన్ని సరఫరా చేస్తున్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెట్‌వర్క్‌లో ఎవరెవరి ప్రమేయం ఉందనే దానిపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మెట్రోరైల్లో యాడ్‌ చూసి మహిళలు ఫైర్.. ఇంతకీ ఆ యాడ్‌లో ఏముందో తెలుసా!

300 ఏళ్ల తర్వాత రామప్ప ఆలయంలో అరుదైన ఘట్టం..

పోలేరమ్మ గుడిలో అద్భుతం.. అమ్మవారి విగ్రహంపై మరో రెండు కళ్లు ప్రత్యక్షం

పేకమేడల్లా కూలుతున్న భవనాలు.. హస్తినలో డేంజర్‌ బెల్స్‌

Published on: Sep 09, 2026 04:07 PM
Loading...
Unable to load recommendations.
Follow Us