ఏడాదికి 50 లక్షల జీతం.. 10 వేల ఫోన్.. ఆటోలో ఆఫీసుకు.. ఈ ఐటీ ఉద్యోగిని కథ వైరల్
ఏటా రూ.50 లక్షల జీతం వచ్చినా లగ్జరీలకు దూరంగా ఉంటూ సాదాసీదా జీవితం గడుపుతున్న బెంగళూరుకు చెందిన ఓ డేటా ఇంజినీర్ కథ సోషల్ మీడియాలో వైరల్ అయింది. బ్రాండెడ్ వస్తువులు, ఖరీదైన జీవనశైలికి బదులుగా తల్లిదండ్రుల కోసం ఇల్లు కొనడం, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆర్థిక భద్రతకే ప్రాధాన్యం ఇస్తోందామె.
అప్పు చేసి బిర్యానీ తింటున్న రోజులివి.. అప్పు చేసి టూర్లకు వెళుతున్న సమాజం ఈనాటిది.. 10 వేల జీతానికి 20 వేలు అప్పు చేసి ఎంజాయ్ చేస్తున్న కాలం ఇది. అలాంటిది ఏడాదికి 50 లక్షల రూపాయల ప్యాకేజీ వస్తుంది.. ప్రతి నెలా అన్ని కటింగ్స్ పోను చేతికి 3 లక్షల రూపాయలు వస్తుంటే.. ఆ వ్యక్తి ఎలా ఉంటాడో ఊహించుకోండి.. లగ్జరీ కారు.. లగ్జరీ ఇల్లు.. లగ్జరీ వాచీలు.. లగ్జరీ ఐ ఫోన్.. సాయంత్రం అయితే పబ్స్.. వీకెండ్ పార్టీలతో ఎంజాయ్ చేస్తుంటారు కదా. అందరి విషయం ఏమో కానీ.. బెంగళూరులోని ఈ ఐటీ ఉద్యోగిని మాత్రం భిన్నం. 50 లక్షల ప్యాకేజీ వస్తున్నా.. 10 వేల రూపాయల ఫోన్ వాడుతోంది. ఆటోలో ఆఫీసుకు వెళుతోంది.. ఒంటిపై బ్రాండెడ్ దుస్తులు లేవు.. ఏదో 30, 40 వేల వేతనం పొందే ఉద్యోగినిలా బతుకుతోంది. ఇంతకీ నెలకు 3 లక్షల రూపాయల డబ్బును ఏం చేస్తుంది.. ఏ విధంగా ఖర్చు పెడుతుందో తెలుసుకుందాం. సాధారణంగా ఐటీ ఉద్యోగం చేసే వాళ్లు ఎలా ఉంటారు, ఏం కొంటారు, ఎలా లైఫ్ ఎంజాయ్ చేస్తారో మనందరికీ తెలిసిందే. కానీ ఓ 27 ఏళ్ల డేటా ఇంజినీర్ కథ వింటే లైఫ్ స్టైల్ అంటే ఆడంబరం కాదు.. ఆర్థిక భద్రత అని అర్థమవుతుంది. ఏటా రూ.50 లక్షల ప్యాకేజీ అందుకుంటున్నా, ఆమె ఎంచుకున్న సాదాసీదా లైఫ్ స్టైల్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. వందల కోట్లు ఉన్నా అంబానీలు సింపుల్‌గా ఉంటారని వింటాం. కానీ నెలకు రూ. 3 లక్షల జీతం వచ్చే ఈ యువతి కూడా అదే బాటలో నడుస్తోంది. ఆమె వద్ద ఎటువంటి లగ్జరీ వస్తువులూ లేవు. చేతిలో డబ్బు ఉందని ఎదుటివారిని ఇంప్రెస్ చేయడానికి ఖర్చు చేయను అంటోందామె. తనకు అనుభవాలు ముఖ్యమని, అలంకారాలు కాదని ధీమాగా చెబుతోంది. చాలామంది జీతం పెరగగానే ఈఎంఐల మోత మోగిస్తుంటే.. ఆమె మాత్రం అనవసర ఖర్చులకు ఆమడ దూరంలో ఉంటూ మోడర్న్ ఏజ్ లైఫ్ బిహేవియర్ రూల్స్ పక్కన పడేసి నేటి యువతను ఆశ్చర్యపరుస్తోంది. ఆమె సంపాదన వెనుక ఒక స్పష్టమైన లక్ష్యం ఉంది. తనను చదివించి ప్రయోజకురాలిని చేసిన తల్లిదండ్రుల కోసం ఆమె ఒక ఇల్లు కొంది. దానికి ప్రతి నెలా రూ.30 వేల ఈఎంఐ చెల్లిస్తూ తన బాధ్యతను నెరవేరుస్తోంది. ఇది తన జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చిన నిర్ణయమని గర్వంగా చెబుతోంది. ఆడంబరాలకు పెట్టే ఖర్చును తగ్గించి.. కన్నవారి కళ్లలో ఆనందాన్ని వెతుక్కుంది. కేవలం సంపాదించడమే కాదు.. ఆ డబ్బును ఎలా పెట్టుబడి పెట్టి గ్రో చేసుకోవాలో కూడా తెలుసుకుంది. ప్రతి నెలా ఏకంగా లక్షను ఎస్‌ఐపీ రూపంలో మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడుతోంది. అకస్మాత్తుగా ఉద్యోగం పోయినా లేదా ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనా.. కనీసం 6 నెలల పాటు ఇబ్బంది పడకుండా ఉండేలా ఎమర్జెన్సీ ఫండ్ సిద్ధం చేసుకుంది. షో-ఆఫ్ కోసం అప్పులు చేసే నేటి కాలం యువతకు ఈ అమ్మాయి ఒక రోల్ మోడల్ అని చెప్పొచ్చు. మన సంపాదన మనకు స్వేచ్ఛను ఇవ్వాలి తప్ప, లేనిపోని గొప్పలకు పోయి.. అప్పుల పాలు కాకూడదన్నది ఆమె ఆమె ఫిలాసఫీ. నిజమైన సంపద అంటే చేతిలో ఉన్న ఐఫోన్ కాదు.. బ్యాంక్ బ్యాలెన్స్, మనశ్శాంతి అని తన సింపుల్ లైఫ్‌స్టయిల్‌తో ఆ అమ్మాయి నిరూపిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫ్రిజ్‌లో కూరగాయలు కుళ్ళిపోతున్నాయా ?? అద్భుతమైన చిట్కా మీకోసం
హైవేపై మహిళ బైక్ కు పంక్చర్.. సాయం చేసేందుకు పోటీపడిన యువకులు
వెయ్యేళ్ల నాటి నిధి లభ్యం.. అంతా స్వచ్ఛమైన బంగారమే
నా శవాన్ని అమ్మానాన్నలకు చూపించొద్దు.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్
