Anil Kumble: పాపం అనిల్ కుంబ్లేకి ఎంత కష్టమొచ్చింది..! ఆర్‌టీసీ బస్సులో ఇంటికి..
బంద్ కష్టాలు ఎంతలా ఇబ్బందిపెడతాయో.. వాటిని ఎదుర్కొనే వారికే తెలుస్తుంది. మరి ఆ కష్టాలు గొప్పోళ్లకు, పెద్ద పెద్దోళ్ళకు తెలియాలంటే.. వాటిని ఫేస్ చేయాలి కదా! భారత మాజీ దిగ్గజం అనిల్ కుంబ్లే అలాంటి కష్టాలే ఎదుర్కొన్నాడు. బంద్ ప్రభావంతో కార్లలో ప్రయాణించే మార్గం లేకపోవడంతో ప్రజా రవాణాకు మొగ్గు చూపారు. అందుకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
బంద్ కష్టాలు ఎంతలా ఇబ్బందిపెడతాయో.. వాటిని ఎదుర్కొనే వారికే తెలుస్తుంది. మరి ఆ కష్టాలు గొప్పోళ్లకు, పెద్ద పెద్దోళ్ళకు తెలియాలంటే.. వాటిని ఫేస్ చేయాలి కదా! భారత మాజీ దిగ్గజం అనిల్ కుంబ్లే అలాంటి కష్టాలే ఎదుర్కొన్నాడు. బంద్ ప్రభావంతో కార్లలో ప్రయాణించే మార్గం లేకపోవడంతో ప్రజా రవాణాకు మొగ్గు చూపారు. అందుకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన శక్తి గ్యారెంటీ పథకంపై ప్రైవేటు రవాణా ఆపరేటర్లు ఆందోళనకు దిగారు. దీన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటక రాష్ట్ర ప్రైవేట్ వాహనాల యజమానుల సంఘం మంగళవారం బెంగళూరు బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో ప్రైవేటు రవాణాకు చెందిన ఆటోలు, ట్యాక్సీలు, మ్యాక్సీ క్యాబ్‌ల సేవలు నిలిచిపోయాయి. ఈ బంద్ కష్టాలు సామాన్య ప్రయాణికులు సాధారణమే అయినా.. గొప్పోళ్లకు మాత్రం కొత్త అనుభూతిని పరిచయం చేస్తున్నాయి. సమ్మె కారణంగా క్యాబ్‌లు అందుబాటులో లేకపోవడంతో మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే బెంగళూరు విమానాశ్రయం నుండి ఇంటికి బస్సులో ప్రయాణించాల్సి వచ్చింది. ఈ మేరకు బీఎంటీసీ బస్సులో ప్రయాణిస్తున్న సెల్ఫీని కుంబ్లే అభిమానులతో పంచుకున్నారు. ఈ పోస్ట్ చూసిన నెటిజెన్స్.. ప్రముఖులు ప్రజా రవాణాను ఉపయోగించడం సమాజానికి మంచిది అని కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..