Benefits Of Tamarind: చింతపండు తింటే బరువు తగ్గుతారానేది నిజమేనా..? నిపుణుల మాట ఏంటంటే..?

Updated on: Apr 01, 2022 | 8:58 PM

ఇప్పుడు చాలా మంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. ఆ బరువు తగ్గేందుకు నానా పాట్లు పడుతున్నారు. ఏవేవో డైట్‌ఫుడ్స్‌, ఎక్స్‌సైజులు చేస్తూ బరువు తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, బరువు తగ్గించేందుకు తీసుకునే ఆహారాల్లో చింతపండును కూడా వాడొచ్చని నిపుణులు చెబుతున్నారు.


ఇప్పుడు చాలా మంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. ఆ బరువు తగ్గేందుకు నానా పాట్లు పడుతున్నారు. ఏవేవో డైట్‌ఫుడ్స్‌, ఎక్స్‌సైజులు చేస్తూ బరువు తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, బరువు తగ్గించేందుకు తీసుకునే ఆహారాల్లో చింతపండును కూడా వాడొచ్చని నిపుణులు చెబుతున్నారు. తరుచుగా చింతపండును తీసుకుంటే చాలా తొందరగా బరువు తగ్గుతారని చెబుతున్నారు. పుల్లగా ఉండే ఈ చింతపండులో ఎన్నో ఔషద గుణాలున్నాయి. మంచి కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు ఇ, కె, సి, బి1, బి2, బి5, బి3, బి6 తో పాటుగా సోడియం, ఐరన్, ఎనర్జీ, జింక్, ఫాస్పరస్, కాల్షియం వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. చింతపండులో ఉండే హైడ్రక్సీ సిట్రిక్ యాసిడ్ మనలో ఫ్యాట్ ప్రొడక్షన్ను తగ్గిస్తుంది. చింతపండులో ఉండే హెచ్‌సీఏ ఫ్యాట్ నిల్వలకు కారణమయ్యే ఎంజైమ్స్‌కు అడ్డుగా నిలుస్తుంది. వ్యాయామం చేస్తున్నప్పుడు కొవ్వు తొందరగా కరిగేందుకు కూడా ఇది ఎంతో సహాయపడుతుందట.చింతపండును రోజు వారి ఆహారంలో తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. చింతపండులో పాలీఫెనాల్స్, ఫ్లెవనాయిడ్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అంతేకాదు దీంతో మెటబాలిజం కూడా పెరుగుతుంది. తద్వారా ఆకలి చాలా వరకు తగ్గుతుంది. దీంతో మీరు ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. చింతపండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి ఇమ్యూనిటీ పవర్‌ను పెంచడానికి ఎంతో ఉపయోగపడుతుంది. బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది. అంతేకాదు ఈ చింతపండు గుండె ఆరోగ్యానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది.

మరిన్ని చూడండి ఇక్కడ:

Wedding Viral Video: లవ్లీ సర్ ప్రైజ్ ఇచ్చిన వరుడు..నవ వధువు ఫిదా! ఈ వీడియోకు లైకుల వర్షం..

Viral Video: పాములు ఇలా కూడా పగ పడతాయా..? ఏడు నెలల్లో మూడు సార్లు కాటు.. యువతిని వెంటాడిన పాము

Chimpanzee Video: నా ఫుడ్‌ జోలికొస్తే తగ్గేదే లే.. చింపాంజీ చేసిన పనికి నవ్వాగదు.. పడి పడి నవ్వాల్సిందే..

Viral Video: బస్‌స్టాప్‌లో అదేం పని రా బాబు.! సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌.!

Viral Video: ఓరి వీడి దుంపతెగ.. ఎంత పని చేసాడు.. రోగిని పట్టుకొని అర్జున్ రెడ్డి సీన్ రిపీట్ చేసాడు..

Loading...
Unable to load recommendations.
Follow Us