సుడిగుండం అనుకుంటే పొరపాటే !! అసలు విషయం తెలిస్తే షాకవుతారు !!

|

Apr 21, 2022 | 8:30 AM

అమెరికాలోని కాలిఫోర్నియాలో అద్బుతం ఆవిష్కృతమైంది. ఈ వీడియో చూడండి. ఇక్కడ ఓ డ్యామ్‌లో ఏదో పెద్ద రంద్రం ఏర్పడి, అందులోంచి నీళ్లు పెద్దఎత్తున లోపలికి వెళ్లిపోతున్నట్లు కనిపిస్తోంది కదా..

అమెరికాలోని కాలిఫోర్నియాలో అద్బుతం ఆవిష్కృతమైంది. ఈ వీడియో చూడండి. ఇక్కడ ఓ డ్యామ్‌లో ఏదో పెద్ద రంద్రం ఏర్పడి, అందులోంచి నీళ్లు పెద్దఎత్తున లోపలికి వెళ్లిపోతున్నట్లు కనిపిస్తోంది కదా.. అవును.. ఇది కాలిఫోర్నియాలోని ఓ లోయలో మోంటిసెల్లో అనే డ్యామ్‌ ఉంది. దీనిని 1950ల్లో కట్టారు. అత్యంత తీవ్రమైన పరిస్థితులు వచ్చినప్పుడు, వర్షాలు విపరీతంగా కురిసినప్పుడు ఈ డ్యామ్‌లో నిండిన నీళ్లు బయటకు వెళ్లేలా ఇంజినీర్లు ఓ భారీ పైపును ఏర్పాటు చేశారు. 22 మీటర్ల వెడల్పు, 75 మీటర్ల పొడవుతో దాన్ని నిర్మించారు. ఈ పైపు నుంచి మరో చిన్న పైపు ద్వారా అర కిలోమీటరు దూరంలోని పుటాహ్‌ క్రీక్‌లోకి నీళ్లను తరలించేలా ఏర్పాటు చేశారు. ఈ వీడియోలో మీకు కనిపిస్తున్న రంద్రం ఈ పైపే. ఈ రంద్రం సెకనుకు దాదాపు 48 వేల క్యూబిక్‌ అడుగుల నీటిని లాగేసుకుంటుంది. ఈ రంధ్రాన్ని స్థానిక ప్రజలు ‘గ్లోరీ హోల్‌’ అని పిలుచుకుంటారు. డ్యామ్‌లో నీటిని నియంత్రించడానికి ఏర్పాటు చేసిన ఇలాంటి రంధ్రాలను ‘బెల్‌ మౌత్స్‌’ అంటుంటారు. ప్రపంచంలోని చాలా డ్యామ్‌లలో ఈ విధానం పాటిస్తున్నారు.

Also Watch:

కిలాడీ జంట చలాకీ చోరీ !! దొంగతనం స్టైల్ చూస్తే బిత్తరపోవాల్సిందే !!

ఈ రెండు తీసుకోండి చాలు !! బీపీ, గుండెపోటు రమ్మన్నా రావు !!

ఎండాకాలం చుండ్రు, దురదతో విసిగిపోతున్నారా ?? అయితే ఇలా చేయండి !!

మొద‌టిసారి డ్రాగ‌న్ ఫ్రూట్ తిన్న పిల్లకోతి రియాక్షన్‌ !! నెట్టింట నవ్వులే నవ్వులు !!

సంగీత్‌ ఫంక్షన్‌లో డాన్స్‌ అదరగొట్టిన నవ వధువు !! స్టెప్పులకు నెటిజన్లు ఫిదా