Viral: కారు డ్రైవర్ ఎకౌంట్‌లో రూ.9 వేల కోట్లు జమ..! ఇంతలోనే స్నేహితుడికి రూ.21 వేలు సెండ్.
ఇటీవల పేదవాళ్ల బ్యాంకు ఖాతాల్లో వందలు, వేల కోట్ల రూపాయలు జమ అవుతున్నాయి. అవి ఎక్కడ్నుంచి వచ్చాయో, ఎలా వచ్చాయో తెలియక కొందరు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఆ మధ్య హరియానాకు చెందిన ఓ పేద రైతు ఖాతాలో 200 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. దాంతో అతను భయపడి రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను ఆశ్రయించాడు. తాజాగా అలాంటిదే మరో ఘటన జరిగింది.
ఇటీవల పేదవాళ్ల బ్యాంకు ఖాతాల్లో వందలు, వేల కోట్ల రూపాయలు జమ అవుతున్నాయి. అవి ఎక్కడ్నుంచి వచ్చాయో, ఎలా వచ్చాయో తెలియక కొందరు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఆ మధ్య హరియానాకు చెందిన ఓ పేద రైతు ఖాతాలో 200 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. దాంతో అతను భయపడి రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను ఆశ్రయించాడు. తాజాగా అలాంటిదే మరో ఘటన జరిగింది. ఓ కారు డ్రైవర్ బ్యాంకు ఖాతాలో ఏకంగా 9 వేల కోట్ల రూపాయలు జమ అయ్యాయి. ఇప్పుడు ఈ వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. తమిళనాడుకు చెందిన ఓ కారు డ్రైవర్ ఖాతాలో అకస్మాత్తుగా 9 వేల కోట్లు జమైంది. పళణి నెయక్కారపట్టికి చెందిన రాజ్‌కుమార్ చెన్నైలోని కోడంబాక్కంలో స్నేహితుడి వద్ద ఉంటూ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 9న మధ్యాహ్నం మూడు గంటల సమయంలో అతడి మొబైల్‌కు తమిళనాడు మర్కెంటైల్ బ్యాంకు నుంచి డబ్బు జమ అయినట్టు మెసేజ్ వచ్చింది. మెసేజ్ చూస్తే ఏకంగా 9 వేల కోట్లు కనిపించింది. అది చూసి అతను ఒక్కసారిగా షాకయ్యాడు. అది నిజమా కాదా అని నిర్ధారించుకోడానికి అతని స్నేహితుడికి 21 వేల రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఇంకేముంది చకచకా డబ్బు స్నేహితుడి ఖాతాలో జమ అయింది.. తన ఎకౌంట్‌లో 9 వేల కోట్లు జమ అయింది నిజమేనని తేలింది. అంతే కారు డ్రైవర్ గాల్లో తేలిపోయాడు. కానీ ఆ సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు. ఆ తరువాత బ్యాంకు వారు రాజ్‌కుమార్‌కు ఫోన్ చేసి పొరపాటున అతని ఎకౌంట్‌లోకి 9 వేల కోట్లు బదిలీ అయ్యిందని వివరించారు. తన స్నేహితుడికి పంపిన డబ్బుతో పాటూ మొత్తం సొమ్మును తమకు అప్పగించాలన్నారు. అయితే, రాజ్‌కుమార్ తరఫున న్యాయవాదులు వెళ్లి బ్యాంకు అధికారులతో మాట్లాడటంతో ఆ 21 వేల రూపాయలు వెనక్కు ఇవ్వాల్సిన పనిలేదని, వాహన రుణం ఇస్తామని బ్యాంకు అధికారులు చెప్పినట్టు తెలుస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..