ప్రపంచంలోనే అత్యంత వింత జీవి.. దీని స్పెషాలిటీ తెలిస్తే షాకే
ప్రపంచంలో మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా జంతువులు, మొక్కలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో ఆక్సోలోట్ల్ ఒకటి.
ప్రపంచంలో మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా జంతువులు, మొక్కలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో ఆక్సోలోట్ల్ ఒకటి. ఈ వింత జీవి తన అవయవాలను తానే తిరిగి పునరుత్పత్తి చేసుకుంటుంది. సాలమండర్ జాతికి చెందిన ఈ జీవి జీవితాంతం న్యూరాన్‌లను అభివృద్ధి చేస్తూనే ఉంటుందని పరిశోధకులు తేల్చారు. ఇటీవల ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు ఇది ఎలా జరుగుతుందనే దానిపై పరిశోధన చేసి, ఎన్నో సంచలన విషయాలు తేల్చారు. ఆక్సోలోట్ల్ తన శరీర భాగాలను పునరుత్పత్తి చేస్తుందని 1964 లో మొదటిసారిగా కనుగొన్నారు. ఆ సమయంలో, వయోజన ఆక్సోలోట్ల్ మెదడులో సగానికి పైగా తొలగిపోయినా, అది మెదడును మళ్లీ అభివృద్ధి చేయగలదని పరిశోధకులు కనుగొన్నారు. ఈ జీవి పునరుత్పత్తి ప్రక్రియను అర్థం చేసుకోవడానికి, శాస్త్రవేత్తలు దాని మెదడు మ్యాప్‌ను తయారు చేశారు. తద్వారా ఆక్సోలోట్ల్ మెదడులోని అన్ని భాగాలకు సంబంధించిన కణాలను తిరిగి అభివృద్ధి చేస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. ఇవి తన జీన్స్ సహాయంతో ఇలా తయారుచేస్తుందని కనుగొన్నారు. దీన్ని అర్థం చేసుకోవడానికి, శాస్త్రవేత్తలు కణాల అభివృద్ధికి సహాయపడే జన్యువులను లెక్కించడానికి ఒక జీవి సింగిల్ సెల్ RNA సీక్వెన్సింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఆక్సోలోట్ల్ మెదడు నెమ్మదిగా అభివృద్ధి చెందుతుందని అధ్యయనం తేలింది. శాస్త్రవేత్తలు జీవి మెదడులోని అతిపెద్ద భాగమైన టెలెన్సెఫలాన్‌ను బయటకు తీశారు. దాని లోపల నియోకార్టెక్స్ ఉంది. ఇది ఏదైనా జీవి ప్రవర్తన, అభిజ్ఞా శక్తిని బలపరుస్తుంది. ఇలా చేసిన 12 వారాల తర్వాత, ఆక్సోలోట్ల్ మెదడుకు కొత్త కణాలను అభివృద్ధి చేయడం ప్రారంభిస్తుందంట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫుల్లుగా మద్యం తాగి బడికొచ్చిన లేడీ టీచర్ !! కట్ చేస్తే ??
Queen Elizabeth-II: ఎలిజబెత్-2 కు పెళ్లికి నిజాం నవాబు ఇచ్చిన గిఫ్ట్ ఇదే..
బెలూన్‌తో పాటు ఎగిరిన రైతు !! గాల్లోనే రెండు రోజులు.. చివరికి ??
పెంపుడు కుక్క దాడిలో.. బాలుడిపై మొహంపై 200 కుట్లు
Traffic Challan: ఇదేం ఫైన్ మావ.. చలాన్ చూసి స్టన్ అయిన వాహనదారుడు !!