Viral Video: ఆటో డ్రైవర్‌ ఐడియా అదిరిందిగా… ఆటోలో లగ్జరీ సదుపాయాలు..!(వీడియో)

|

Feb 07, 2022 | 9:55 AM

ఒక ఆటోడ్రైవర్‌ వినూత్నంగా ఆలోచించాడు. తన ఆటోలో కస్టమర్లను ఆకర్షించేందుకు లగ్జరీ కార్లలో సైతం లభించని సౌకర్యాలు కల్పించాడు.

ఒక ఆటోడ్రైవర్‌ వినూత్నంగా ఆలోచించాడు. తన ఆటోలో కస్టమర్లను ఆకర్షించేందుకు లగ్జరీ కార్లలో సైతం లభించని సౌకర్యాలు కల్పించాడు. మెట్రో ట్రైన్‌లో కూడా ఇలాంటి సౌకర్యాలు లభించవంటే నమ్మండి. అవును అతని ఆటో ఎక్కిన వాళ్ళుకూడా అదే చెబుతారు. ఎందుకంటే అతని ఆటోలో కస్టమర్ల కోసం ఫ్రీ వైఫై, టీవీ, ల్యాబ్, ల్యాప్‌లాప్‌, న్యూస్‌ పేపర్స్‌, మ్యాగజైన్స్ ఇలా సామాన్యుడినుంచి బిజినెస్‌ మెన్ వరకూ అందరికీ ఉపయోగపడే సదుపాయాలు కల్పించాడు. అతని ఆటోలో ప్రయాణించినంతసేపు… ఎవరి అవసరాలకు వీలుగా వారు వాటిని వినియోగించుకోవచ్చు. అంతేకాదండోయో మధ్యలో ఆకలేస్తే తినడానికి స్నాక్స్‌ కూడా ఏర్పాటు చేశాడు… ఇది కదండీ ఐడియా అంటే.. బిజినెస్‌ చేయాలంటే డిగ్రీలు చదవాల్సిన అవసరం లేదని నిరూపిస్తున్నాడు చెన్నైకి చెందిన అన్నాదురై అనే ఈ ఆటో డ్రైవర్‌.

Published on: Feb 07, 2022 09:25 AM