మళ్లీ కరోనా ప్రళయం.. ఆ నౌకలో 800 మందికి పాజిటివ్..
ప్రపంచం నుంచి కరోనా క్రమంగా తొలగిపోతోందనే ఆనందం ఆవిరైపోతోంది.. న్యూజిలాండ్ నుంచి బయలుదేరిన మేజెస్టిక్ ప్రిన్సెస్ క్రూయిజ్‌లో దాదాపు 800 కొవిడ్ కేసులు బయటపడ్డాయి.
ప్రపంచం నుంచి కరోనా క్రమంగా తొలగిపోతోందనే ఆనందం ఆవిరైపోతోంది.. న్యూజిలాండ్ నుంచి బయలుదేరిన మేజెస్టిక్ ప్రిన్సెస్ క్రూయిజ్‌లో దాదాపు 800 కొవిడ్ కేసులు బయటపడ్డాయి. దీంతో ఆ నౌకను ఆస్ట్రేలియా తీరంలోని సిడ్నీ తీరంలో నిలిపేశారు. ఈ క్రూయిజ్ 12 రోజుల పాటు సముద్రయానం చేసింది. ఇందులో 4,600 మంది ప్రయాణీకులు, సిబ్బంది ఉన్నారు.. మెల్‌బోర్న్ చేరాల్సిన మేజెస్టిక్ ప్రిన్సెస్ క్రూయిజ్‌లో ఇంత భారీ సంఖ్యలో కొవిడ్ కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగించింది. ప్రయాణీకులందరినీ ఐసోలేషన్‌లో ఉంచారు. 2020లో కూడా ఆస్ట్రేలియా తీరంలో రూబీ ప్రిన్సెస్ క్రూజ్ నౌకలో భారీ స్థాయిలో కరోనావైరస్ కేసులు బయటపడటం కలవరం రేపింది. మరోవైపు ఆస్ట్రేలియాలో వారం రోజుల వ్యవధిలో 19,800 కేసులు వెలుగు చూశాయి. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆంక్షలు విధించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇదేం వింత.. బాలిక కంటి నుంచి కన్నీళ్లతో పాటు బియ్యం, రాళ్లు
విడాకులకు సిద్ధమైన దంపతులు.. చిన్నారి జవాబుతో చలించిన జడ్జి..
బామ్మకు దడ పుట్టించినఇంట్లోని బాతు బొమ్మ.. వీడియో చూస్తే షాక్
Digital TOP 9 NEWS: మృతదేహాన్ని 35 ముక్కలుగా కోసి.. ఫ్రిడ్జ్‌లో పెట్టి.! | ఆ తర్వాత గుండెపోటుతో
TOP 9 ET News: RRR సీక్వెల్‌పై జక్కన్న క్లారిటీ | ఆ తర్వాతే నా పెళ్లి హీరో విశాల్ క్లారిటీ