గాల్లో ఎగురుతున్న విమానంలో మంటలు.. చివరికి ??
టేకాఫ్ అయిన 50 నిముషాలకు వర్జిన్ ఆస్ట్రేలియాకు చెందిన బోయింగ్ విమానంలో మంటలు చెలరేగాయి. దీంతో కాసేపు ప్యాసింజర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక భయంతో బిక్కచచ్చిపోయారు. అప్రమత్తమైన సిబ్బంది న్యూజిలాండ్ సిటీ ఎయిర్‌పోర్ట్‌లో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియరాలేదని న్యూజిలాండ్ ఎయిర్‌పోర్ట్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
టేకాఫ్ అయిన 50 నిముషాలకు వర్జిన్ ఆస్ట్రేలియాకు చెందిన బోయింగ్ విమానంలో మంటలు చెలరేగాయి. దీంతో కాసేపు ప్యాసింజర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక భయంతో బిక్కచచ్చిపోయారు. అప్రమత్తమైన సిబ్బంది న్యూజిలాండ్ సిటీ ఎయిర్‌పోర్ట్‌లో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియరాలేదని న్యూజిలాండ్ ఎయిర్‌పోర్ట్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రయాణికుల సంఖ్య కూడా తెలియలేదని చెప్పారు. న్యూజిలాండ్‌లోని క్వీన్స్ టౌన్ నుంచి ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్కు వెళ్లేందుకు వర్జిన్ ఆస్ట్రేలియా బోయింగ్ విమనం సోమవారం బయలుదేరింది. టేకాఫ్ అయిన 50 నిమిషాల తర్వాత ఇన్‌వర్‌కార్గిల్‌కు చేరుకోగానే ఇంజిన్‌లో మంటలు చెలరేగినట్లు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత న్యూజిలాండ్ సిటీ ఎయిర్‌పోర్ట్‌కు అత్యవసరంగా విమానాన్ని మళ్లించారు. అయితే పక్షి ఢీకొట్టడం వల్లే ఇంజిన్‌లో మంటలు చెలరేగి ఉండవచ్చని వర్జిన్ ఆస్ట్రేలియా ఓ ప్రకటనలో తెలిపింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కవలలకు జన్మనిచ్చిన ఏనుగు !! అరుదైన ఘటన ఎక్కడంటే ??
ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా ?? ‘గ్రాట్యుటీ’ ఎంత వస్తుందో తెలుసా ??
యాక్టింగ్ సూపర్ క్వీన్.. జైలులో రిమాండ్ మహిళా ఖైదీ హైడ్రామా