Friendship: ప్రాణం తీసిన స్నేహం.. అదీ కత్తితో కోసుకునేంతలా..! వీడియో..

|

Aug 17, 2023 | 8:54 AM

స్నేహితులు కోసం ప్రాణాలు ఇస్తానని ఓ యువకుడు మత్తులో నిండు ప్రాణాలు తీసుకున్నాడు. ఇబ్రహీం అనే యువకుడు మద్యం మత్తులో కాలు దగ్గర కత్తితో కోసుకుని మృతిచెందాడు. కడప నగరంలోని పాత మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కడప నగరంలోని నకష్‌ ప్రాంతానికి చెందిన ఇబ్రహీం స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. అదే సమయంలో స్నేహితుల మద్య మాటా మాట పెరగింది.

నీ కోసం ఏం చేయమైనా చేస్తా.. ప్రాణాలైనా ఇస్తానని స్నేహితులు అప్పుడప్పుడు సరదా అంటుంటారు. అయినా ఏదో మాటవరుసకు అంటారులే అని వదిలేస్తాం.. కానీ కడప జిల్లాలో ఓ యువకుడు మాత్రం స్నేహితుల కోసం ప్రాణం ఇస్తానంటూ మద్యం మత్తులో నిజంగా బలి తీసుకున్నాడు. స్నేహితులు కోసం ప్రాణాలు ఇస్తానని ఓ యువకుడు మత్తులో నిండు ప్రాణాలు తీసుకున్నాడు. ఇబ్రహీం అనే యువకుడు మద్యం మత్తులో కాలు దగ్గర కత్తితో కోసుకుని మృతిచెందాడు. కడప నగరంలోని పాత మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కడప నగరంలోని నకష్‌ ప్రాంతానికి చెందిన ఇబ్రహీం స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. అదే సమయంలో స్నేహితుల మద్య మాటా మాట పెరగింది. స్నేహానికి ఎంతో విలువ ఇస్తానని.. మిత్రుల కోసం ప్రాణాలు ఇస్తానంటూ ఇబ్రహీం ఆవేశానికి లోనయ్యాడు. అంతలోనే కత్తితో తన కాలును కోసుకోవడంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది. సంఘటనా స్థలంలోనే ఇబ్రహీం ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే పలు కేసుల్లో నిందితుడుగా ఉన్న ఇబ్రహీం మృతిపట్ల పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...