Cosmetic Surgery: కాస్మొటిక్ సర్జరీ వికటించి అర్జెంటీనా నటి సిల్వినా లూనా మృతి..
అవకాశాల కోసం కొందరు నటీమణులు తమ అందానికి మరింత మెరుగులు దిద్దుకోవాలనుకుంటారు. ఇందులో భాగంగానే శరీరంలోని కొన్ని భాగాలకు కాస్మొటిక్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటారు. అయితే ఈ సర్జరీ అంత సులువైంది కాదు. అందులో వాడే పదార్థాలు బెడిసికొడితే ప్రాణాలకే ముప్పు. ఇలా కొందరు ప్లాస్టిక్ సర్జరీలు వికటించి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలూ ఉన్నాయి.
అవకాశాల కోసం కొందరు నటీమణులు తమ అందానికి మరింత మెరుగులు దిద్దుకోవాలనుకుంటారు. ఇందులో భాగంగానే శరీరంలోని కొన్ని భాగాలకు కాస్మొటిక్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటారు. అయితే ఈ సర్జరీ అంత సులువైంది కాదు. అందులో వాడే పదార్థాలు బెడిసికొడితే ప్రాణాలకే ముప్పు. ఇలా కొందరు ప్లాస్టిక్ సర్జరీలు వికటించి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలూ ఉన్నాయి. తాజాగా ప్లాస్టిక్ సర్జరీ వికటించడంతో అర్జెంటీనాకు చెందిన ప్రముఖ నటి, మోడల్ సిల్వినా లూనా మరణించింది. సిల్వినా లూనా అర్జెంటీనా టీవీ పరిశ్రమలో నటిగా, యాంకర్‌గా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది. మోడల్‌గా కూడా రాణిస్తూ సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. అయితే సిల్వినా గత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతోనూ బాధపడుతున్నట్లు తెలిసింది. ఇందుకోసం వారానికి నాలుగు సార్లు కిడ్నీలకు డయాలసిస్ చేయించుకునేది. అయితే ఇటీవలే కాస్మొటిక్ సర్జరీ చేయించుకోవడానికి వెళ్ళింది. అయితే, దురదృష్టవశాత్తూ ప్లాస్టిక్ సర్జరీ వికటించడంతోపాటు ఆ ప్రభావం తన కిడ్నీ సమస్యపై మరింత ఎఫెక్ట్ పడిండి. ఈ క్రమంలో కొన్నిరోజులపాటు ప్రాణాలతో పోరాడిన సిల్వినా చివరకు 43 ఏళ్ల వయసులో ప్రాణాలు కోల్పోయింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..