నిప్పుల కొలిమిలా ఏపీ…54 మండలాల్లో తీవ్ర వడగాలుల ముప్పు!

Updated on: Apr 04, 2026 | 10:13 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండ తీవ్రతకు తోడు వడగాలులు తోడవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ క్రమంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ శుక్రవారం రాష్ట్రంలోని 54 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలపై వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వీటితో పాటు పోలవరం పరిసర ప్రాంతాల్లో కూడా ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

తీవ్రమైన ఎండల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది. వృద్ధులు, గర్భిణీలు మరియు చిన్నపిల్లలు ఎండ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండటానికి తగినంత నీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ వంటి పానీయాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బయట తిరిగే వారు గొడుగు, టోపీ లేదా నెత్తిపై తడి గుడ్డ కట్టుకోవడం శ్రేయస్కరమని అధికారులు తెలిపారు. వాతావరణంలో వస్తున్న ఈ మార్పుల పట్ల ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.

మరిన్ని వీడియోల కోసం :

బాబోయ్‌.. గుడిలో పాములు..భక్తుల పరుగులు!

పొలం చదును చేస్తుండగా బరువుగా తగిలిన కుండ..లోపల చూడగా కళ్లు జిగేల్‌!

గ్రామంలో వింత తీర్మానం.. పోలీసుల పిలుపుతో మారిన సీన్‌

రండి.. నరికి సొరచేపలకు వేస్తాం.. అమెరికా సైనికులకు ఇరాన్‌ కవ్వింపు

Loading...
Unable to load recommendations.
Follow Us