వైభవంగా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథయాత్ర
గోదావరి జిల్లాల అంటేనే ఆధ్యాత్మికతకు నిలువెత్తు నిదర్శనం. అటువంటి గోదావరి జిల్లాలో ఒకటైన కోనసీమలో అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం.. అత్యంత ఘనంగా కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ వేడుక కన్నుల పండువగా జరుగుతుంది. ఈ ఏడాది కూడా కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది.
పోలీసులు దారి పొడవునా భారీ బందోబస్తుకు ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీలక్ష్మీనరసింహస్వామివారి రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా రథోత్సవం నిర్వహించారు. ఆలయ ఛైర్మన్ మొగల్తూరు రాజా కలిదిండి కుమార రామగోపాల రాజా బహదూర్ తొలిపూజ చేసి ఈ రథోత్సవాన్ని ప్రారంభించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆలయం నుంచి స్వామి-అమ్మవార్ల ఉత్సవమూర్తులను రథంపై ఉంచి.. ఊరేగింపుగా స్వామివారిని తీసుకువచ్చారు. గోవింద, నరసింహ నామస్మరణలతో రథాన్ని భక్తులు లాగారు.