కొడుకు హత్యకు తండ్రి సుపారీ… ఎందుకో తెలిసి పోలీసులే షాక్
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లో గాదె అంజయ్య అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో అంజయ్య తండ్రి, భార్య సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు విచారణలో తేలింది. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో తండ్రి, భార్య పన్నిన కుట్ర వివరాలు వెల్లడయ్యాయి.
కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన గాదె అంజయ్య అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో మృతుడి తండ్రి, భార్యే సుపారీ ఇచ్చి అంజయ్యను హత్య చేయించినట్లు విచారణలో తేలింది. ఈ దారుణానికి పాల్పడిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మృతుడు అంజయ్య 2017లో గల్ఫ్ వెళ్లి.. 2019లో స్వగ్రామానికి వచ్చి ఇక్కడే పొలం పనులు చేసుకుంటున్నాడు. అతడు గల్ఫ్ నుంచి వచ్చిన తర్వాత తన తండ్రి లచ్చయ్య, తన భార్య లక్ష్మి మధ్య వివాహేతర సంబంధం నడుస్తోందని గ్రహించి పలుమార్లు వారిద్దరినీ మందలించాడు. అయినా వారి పద్ధతి మారకపోవటంతో.. ఈ విషయాన్ని సమీప బంధువులతో చెప్పటంతో వారిద్దరూ అంజయ్య మీద కోపం పెంచుకున్నారు. ఈ క్రమంలోనే అంజయ్యను అడ్డుతొలగించుకోవాలని వారు పథకం వేశారు. నేరుగా చంపితే తమపైనే.. అనుమానం వస్తుందని అదే గ్రామానికి చెందిన కొలిపాక రవి సహాయంతో హత్యలు చేసే గ్యాంగ్‌ను సంప్రదించారు. దీంతో, రవి తన బంధువైన ఉప్పరపల్లి కోటేశ్వర్, అతని స్నేహితుడు మహమ్మద్ అబ్రార్‌లను..లచ్చయ్యకు పరిచయం చేయటం, వారు అంజయ్య హత్యకు రూ. 3 లక్షల ఒప్పందం కుదుర్చుకోవటం జరిగిపోయాయి. తర్వాత కోటేశ్వర్, అబ్రార్.. నెమ్మదిగా అంజయ్యతో స్నేహం పెంచుకున్నారు. గత కొన్ని రోజులుగా వారు తరచూ.. మద్యం సేవించటం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 2న మద్యం తాగుదామని అంజయ్యను ఊరి చివర కెనాల్ సమీపంలోకి వారిద్దరూ పిలిచారు. అక్కడ అతనికి బాగా మద్యం తాగించి, అతడు మత్తులోకి జారుకోగానే కోటేశ్వర్ గొంతు నులమగా, అబ్రార్ కాళ్లు, చేతులు కదలకుండా పట్టుకుని.. అంజయ్యను హతమార్చారు. మృతదేహాన్ని D-8 కెనాల్‌లోకి విసిరేశారు. నిందితుడు రవి స్వయంగా ఈ విషయాన్ని లచ్చయ్యకు చేరవేశాడు. తర్వాత అంజయ్య ప్రమాదవశాత్తూ కాలువలో పడి చనిపోయాడని గ్రామంలో అందరినీ నమ్మించారు. కానీ, బంధువులు అనుమానం వ్యక్తం చేయటంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో లచ్చయ్య, శిరీషల పాత్ర బయటపడటంతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తాజ్‌మహల్ కనిపించుట లేదు.. పొగమంచులో ఉత్తర భారతం
Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. స్పర్శ దర్శనం సమయాలు
ఒక్క గ్రామ పంచాయతీకి ఇద్దరు సర్పంచులా ?? ఇదెక్కడి ట్విస్ట్
‘కమెడియన్స్‌ది ఏ స్థానమో మళ్లీ చూపించారు’ మీకో దండం
Demon Pavan: డీమాన్ పవన్‌కు జాక్ పాట్ విన్నర్ ప్రైజీ మనీకి సమానంగా నొక్కాడు
