AP News: బైక్‌కు ఫైన్ వేశారని.. పోలీస్ హెల్ఫ్ డెస్క్‌కు పవర్ కట్ చేశారు..
ట్రాఫిక్ చలాన్ జారీ చేయడంతో ఆగ్రహం చెందిన ఏపీఈపీడీసీఎల్ లైన్‌మెన్ పార్వతీపురం-మన్యం జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ హెల్ప్ డెస్క్‌కు శుక్రవారం విద్యుత్ సరఫరాను నిలిపివేశాడు. డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీసులతో లైన్‌మెన్ వాగ్వాదానికి దిగాడు. నాకే ఫైన్ వేస్తారా అని ఆవేశంగా వెళ్లి వపర్ కట్ చేశాడు. ట్రాఫిక్ రూల్స్ గురించి ఆయనకు వివరించినా వినలేదు. విద్యుత్ సరఫరాను నిలిపివేశాడు. అయితే తర్వాత స్థానికులు సైతం చివాట్లు పెట్టడంతో.. విద్యుత్ సరఫరా తరువాత పునరుద్ధరించారు.
ఆగస్టు 26: ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురంలో విద్యుత్ సిబ్బంది ఓవర్ యాక్షన్ చేశారు. తాము చట్టానికి అతీతులం అన్నట్లు బిహేవ్ చేశారు. పోలీస్ సేవలకు అంతరాయం కలిగించి.. లిమిట్స్ క్రాస్ చేశారు. కేవలం విద్యుత్ ఉద్యోగి బైక్‌కి జరిమానా విధించారని పోలీస్ హెల్ప్‌డెస్క్‌కు పవర్ కట్ చేశారు. తమ వాహనాలకు ఫైన్ ఎందుకు వేశారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. జరిమానా విధిస్తే పవర్ కట్ చేస్తామని ముందే హెచ్చరించారు. చెప్పినట్టే అప్పటికప్పుడు కరెంట్ పోల్ ఎక్కి పవర్ కట్ చేశారు విద్యుత్ సిబ్బంది. పోలీసులు ఎందుకు ఇలా చేశారని ప్రశ్నించినా కూడా.. అస్సలు పట్టించుకోలేదు. మీరేం చేసుకుంటారో చేసుకోండి అన్నట్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సామాన్యులకు నిత్యం.. సేవలు అందించే పోలీస్ హెల్ప్ డెస్క్ పవర్ కట్ చేయడంతో స్థానికులు సైతం విద్యుత్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ట్రాఫిక్ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఎం పాపయ్య తెలిపిన వివరాల ప్రకారం.. 25 ఏళ్ల యువకుడు ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ నుంచి వాహనం తనిఖీ చేస్తుండగా వాహనం ఆపకుండా వెళ్లిపోయాడు. హెల్మెట్ ధరించనందుకు ట్రాఫిక్ పోలీసులు అతని ఫోటో తీసి రూ.135 జరిమానా విధిస్తూ ఈ-చలాన్ జారీ చేశారు. మెసేజ్ అందుకున్న యువకుడు మరో ఇద్దరితో కలిసి ట్రాఫిక్ పోలీస్ డెస్క్ వద్దకు వచ్చి తనను తాను ఏపీఈపీడీసీఎల్ కింద పనిచేస్తున్న లైన్‌మెన్ ఉమ అని పరిచయం చేసుకున్నాడు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన అతను విద్యుత్ సరఫరాను నిలిపివేస్తానని బెదిరించాడు. వెంటనే వెళ్లి అన్నంత పని చేసేశాడు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..