ప్రశాంతమైన మరణానికి మార్గం సుగమం!!

Updated on: Jul 13, 2026 | 4:49 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ప్యాసివ్ యూతనేషియా (కారుణ్య మరణం) అమలుకు కొత్త నియమాలు రూపొందించింది. కోలుకోలేని రోగులకు కృత్రిమ వైద్య సహాయాన్ని నిలిపివేయడం ద్వారా గౌరవప్రదమైన మరణానికి అనుమతించడం దీని ఉద్దేశం. లివింగ్ విల్ విధానం, వైద్య బృందాల ధ్రువీకరణ, న్యాయపరమైన ఆమోదం ఇందులో కీలకం.

ప్రాణం విలువైనదే అయినా, కొన్నిసార్లు నయంకాని వ్యాధులతో బాధపడేవారికి మరణమే శాంతినిస్తుంది. తీవ్రమైన అనారోగ్యం, భరించలేని నొప్పి, కోలుకునే అవకాశం లేదని తెలిసినప్పుడు మనిషి కోరుకునేది శాంతియుతమైన ముగింపు. దీన్నే కారుణ్య మరణం లేదా వైద్య పరిభాషలో ప్యాసివ్ యూతనేషియా అంటారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ప్యాసివ్ యూతనేషియా అమలుకు కొత్త గైడ్లైన్స్ రూపొందించింది. ప్యాసివ్ యూతనేషియా అంటే ప్రాణం పోసే కృత్రిమ వైద్య సహాయాలను నిలిపివేయడం. వెంటిలేటర్, లైఫ్ సపోర్ట్ వంటి చికిత్సలను ఆపివేసి రోగికి సహజ మరణానికి అవకాశం ఇవ్వడం. ఇది రోగికి ప్రాణాంతక మందులిచ్చి చంపడం కాదు. దాన్ని యాక్టివ్ యూతనేషియా అంటారు, దీనికి భారతదేశంలో అనుమతి లేదు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మార్గదర్శకాల ప్రకారం, రోగి చికిత్సకు లొంగని దశలో ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రక్రియ వర్తిస్తుంది. రోగి స్పృహలో ఉంటే భవిష్యత్తు కోసం లివింగ్ విల్ ద్వారా నిర్ణయం తీసుకోవచ్చు. ముగ్గురు వైద్యుల బృందం, డిఎంహెచ్‌ఓతో కూడిన నిపుణుల బృందం రోగి పరిస్థితిని సమీక్షించిన తర్వాత, జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆమోదంతోనే లైఫ్ సపోర్ట్‌ను తొలగిస్తారు. గౌరవంగా మరణించే హక్కులో భాగంగానే ఈ విధానం అమలులోకి వచ్చింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైల్లో రెచ్చిపోయిన కొత్తజంట.. దెబ్బకు టీసీ ఉద్యోగం ఊస్ట్‌!

ఈసీజీ కూడా కనిపెట్టలేనిది.. ఏఐ కనిపెట్టేసిందిగా!

Rao Bahadur: స్టార్ హీరో చేయాల్సిన సినిమా.. సత్యదేవ్‌ ఖాతాలోకి వచ్చింది!

ఉప్పునీటితో విద్యుత్‌.. సముద్ర గర్భంలో సరికొత్త విప్లవం

Follow Us