పొలం చదును చేస్తుండగా అద్భుతం..అమితానందంలో రైతు!

Updated on: May 27, 2026 | 4:22 PM

తిరుపతి జిల్లా పాకాల మండలంలోని ఇరంగారిపల్లిలో పొలం తవ్వకాల సమయంలో పురాతన దుర్గాదేవి విగ్రహం వెలుగుచూసింది. జేసీబీ తవ్వకాలలో బయటపడిన ఈ సింహవాహన దుర్గామాత విగ్రహాన్ని చూసి గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడుతోంది.

అచంచలమైన దైవలీలలు ఎప్పుడు, ఏ రూపంలో వ్యక్తమవుతాయో చెప్పలేం. తిరుపతి జిల్లా పాకాల మండలంలో సరిగ్గా ఇలాంటి ఒక అద్భుత ఘటనే చోటుచేసుకుంది. పొలం పనుల్లో నిమగ్నమైన రైతులకు సాక్షాత్తూ ఆ జగన్మాత దుర్గాదేవి పురాతన విగ్రహ రూపంలో సాక్షాత్కరించింది. పాకాల మండలంలోని ఇరంగారిపల్లి గ్రామానికి చెందిన ఒక రైతు తన పొలాన్ని చదును చేస్తూ, చుట్టూ కంచె వేయడం కోసం జేసీబీతో తవ్వకాలు జరిపిస్తున్నారు. ఆ సమయంలో జేసీబీ బకెట్‌కు ఏదో బలంగా అడ్డుపడింది. అనుమానంతో అక్కడి మట్టిని జాగ్రత్తగా తొలగించారు. అంతే.. ఆ మట్టిలో బయల్పడిన ఆ దృశ్యం చూసి అక్కడున్న వారు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. సాక్షాత్తూ సింహవాహనంపై గంభీరంగా ఆశీనురాలై ఉన్న దుర్గాదేవి భవ్య విగ్రహం వెలుగుచూసింది. భూ గర్భం నుంచి అమ్మవారి రూపం బయటపడటంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. సురక్షితంగా విగ్రహాన్ని బయటకు తీసి, పొలంలోనే ప్రతిష్టించారు. ఈ విషయం సమీప గ్రామాలకు దావానలంలా వ్యాపించడంతో చుట్టుపక్కల ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. మట్టిలోనుంచి వచ్చిన ఈ మహాశక్తి శతాబ్దాల నాటి పురాతన విగ్రహంగా భావిస్తున్నారు. ఈ దుర్గాదేవి అమ్మవారికి స్థానికులు మంగళహారతులు ఇచ్చి, ప్రత్యేక పూజలు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, పొలం యజమాని నుంచి వివరాలు సేకరించారు. ప్రస్తుతం ఈ పురాతన విగ్రహం పొలంలోనే భక్తుల జయజయధ్వానాల మధ్య, ప్రత్యేక ధూపదీప నైవేద్యాలతో పూజలందుకుంటోంది. అమ్మవారి పునరాగమనం ఆ గ్రామానికి శుభసూచకమని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నీటి కోసం బస్సును ఆపిన కోతి.. మూగజీవాల వీడియో వైరల్

60 లీటర్ల తల్లిపాలు దానం చేసిన గుత్తా జ్వాల.. వేల మంది చిన్నారులకు అమ్మగా మారిన స్టార్

ఫోర్జరీ పత్రాలతో జైలు నుంచి దర్జాగా రిలీజైన జీవిత ఖైదీ..

గుడిలోకి వెళ్లి భక్తితో దణ్ణం పెట్టాడు.. ఆ తర్వాత..!

రూ.100 మ్యాగీ, ఓ కూల్ డ్రింక్ బాటిల్..బాలుడి బర్త్‌డే వేడుకలు వైరల్‌

Follow Us