Viral: అమ్మా.. నేను చనిపోయే ఆట ఆడుకుంటా అంటూ.. అదే ఆటకు బలైపోయిన బాలుడు.

|

Sep 14, 2023 | 8:23 AM

ఇటీవల చిన్నారులు టీవీలు, సెల్‌ ఫోన్లకు బానిసలుగా మారుతున్నారు. చదువును కూడా పక్కనపెట్టి ఫోన్లకు, టీవీలకు అతుక్కుపోతున్నారు. కార్లూన్లు చూస్తూ అందులో జరిగే సన్నివేశాల్లో ఉన్నట్టు తామూ చెయ్యాలని ప్రయత్నిస్తుంటారు కొందరు. తాజాగా ఓ బాలుడు అమ్మా.. నేను చనిపోయే ఆట ఆడుకుంటానంటూ ఆటపట్టిస్తూ అదే ఆటకు తాను బలైపోయాడు. ఆ తల్లికి తీరని కడుపుశోకం మిగిల్చాడు. ఈ విషాద ఘటన విశాఖజిల్లా లో చోటుచేసుకుంది.

ఇటీవల చిన్నారులు టీవీలు, సెల్‌ ఫోన్లకు బానిసలుగా మారుతున్నారు. చదువును కూడా పక్కనపెట్టి ఫోన్లకు, టీవీలకు అతుక్కుపోతున్నారు. కార్లూన్లు చూస్తూ అందులో జరిగే సన్నివేశాల్లో ఉన్నట్టు తామూ చెయ్యాలని ప్రయత్నిస్తుంటారు కొందరు. తాజాగా ఓ బాలుడు అమ్మా.. నేను చనిపోయే ఆట ఆడుకుంటానంటూ ఆటపట్టిస్తూ అదే ఆటకు తాను బలైపోయాడు. ఆ తల్లికి తీరని కడుపుశోకం మిగిల్చాడు. ఈ విషాద ఘటన విశాఖజిల్లా లో చోటుచేసుకుంది. ఓ ఎనిమిదేళ్ల బాలుడు అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. ఎప్పుడూ ఇంట్లో చున్నీ పట్టుకొని ఆడుకుంటూ.. ఉరి వేసుకొంటానని ఆ బాలుడు అంటూఉంటే ఆ తల్లి అలా అనకూడదని మందలించి ఊరుకునేది. అదే ఇప్పుడు ఆ బాలుని ప్రాణాలు తీసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. కైలాసపురం కస్తూరి నగర్‌కు చెందిన పైడ శ్రీనివాసరావు, శ్రీలక్ష్మి దంపతుల కుమారుడు డింపుల్‌ సూర్య ఓ ప్రయివేటు పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు. సెప్టెంబర్‌ 11న సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక.. స్కూల్ బ్యాగ్ ఇంట్లో పెట్టి.. ఓ చున్నీ తీసుకొని వరండాలో ఆడుకుంటున్నాడు. తల్లి లోపల గదిలో టీవీ చూసుకుంటూ ఉంది. తండ్రి శ్రీనివాసరావు ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తాడు. ఎప్పటిలాగే అతను పనికి వెళ్ళిపోయాడు. అటుగా వెళుతున్న ఓ మహిళ బాలుడు కిటికీకి వేళాడుతుండటం చూసి పెద్దగా కేకలు వేసింది. దీంతో లోపల నుంచి వచ్చిన తల్లి శ్రీలక్ష్మి మెట్ల పక్కన సూర్య చున్నీతో ఉరివేసుకొని ఉండటం చూసి భయంతో కేకలు వేసింది. వెంటనే కత్తిపీటతో చున్నీని కోసి బాలుడ్ని కిందకు దించింది. హుటాహుటిన సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోయింది. డింపుల్ సూర్య ప్రణాలు కోల్పోయినట్టు వైద్యులు దృవీకరించారు. తల్లి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎలక్ట్రికల్ పైపు నుంచి కిందకు చున్నితో జారిపడి మెడకు బిగుసుకుని ప్రాణాలు కోల్పోయి ఉంటాడని అనుమానిస్తున్నారు. క్లూస్ టీమ్ తో ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..