Viral: ఎన్ని కోట్లు ఉంటే ఏం లాభం..పెళ్ళి మాత్రం అవడం లేదు.. వీడియో.

Updated on: Aug 21, 2023 | 7:30 AM

కోట్ల రూపాయలు ఉంటే ఏం లాభం తోడు లేనప్పుడు అంటున్నాడు అమెరికా బిలియనీర్. మంచి శరీర సౌష్టవంతో అందంగా ఉండే బ్రయన్ కి పెళ్ళి చేసుకోవడానికి అమ్మాయిలే దొరకడం లేదంట. అమ్మాయిల కోసం ఎదురు చూసి ఎదురు చూసి 45 ఏళ్ళు గడిపేశాడు. అమెరికాలో అత్యంత సంపన్నుల్లో ఒకడైన బ్రయన్ జాన్సన్ అందంగా ఉండడానికి చాలా కష్టపడతాడు. అస్సలు చెడు అలవాట్లు లేవు.

కోట్ల రూపాయలు ఉంటే ఏం లాభం తోడు లేనప్పుడు అంటున్నాడు అమెరికా బిలియనీర్. మంచి శరీర సౌష్టవంతో అందంగా ఉండే బ్రయన్ కి పెళ్ళి చేసుకోవడానికి అమ్మాయిలే దొరకడం లేదంట. అమ్మాయిల కోసం ఎదురు చూసి ఎదురు చూసి 45 ఏళ్ళు గడిపేశాడు. అమెరికాలో అత్యంత సంపన్నుల్లో ఒకడైన బ్రయన్ జాన్సన్ అందంగా ఉండడానికి చాలా కష్టపడతాడు. అస్సలు చెడు అలవాట్లు లేవు. కాని ఇన్ని మంచి లక్షణాలు ఉన్నా…ఇతన్ని పెళ్ళి చేసుకోవడానికి మాత్రం ఒక్కరూ ముందుకు రావడం లేదు. కనీసం డేటింగ్ కి కూడా ఎస్ చెప్పడం లేదంట. పాపం బ్రయన్ కు ఇదో పెద్ద సమస్య అయిపోయింది. అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్టు తయారయింది ఇతని పరిస్థితి. బ్రయన్ వయసు 45. అయినా అది తెలియకుండా ఉండడానికి ఏడాదికి ఏకంగా 16 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాడు. ఒకప్పుడు బాగా మందు తాగేవాడంట. కానీ క్యాలరీలు పెరుగున్నాయని అది కూడా మానేశాడు . అందం కోసం రోజుకు 111 ట్యాబ్లెట్లు వేసుకుంటా అని చెబుతున్నాడు. అయినా అమ్మాయిలు దగ్గరకు కూడా రావడం లేదని వాపోతున్నాడు.

అయితే అమ్మాయిలు ఇతన్ని ఎందుకు ఇష్టపడడం లేదు, కనీసం డేటింగ్ కి కూడా ఎందుకు ఎస్ అని అనడం లేదు అని ఆరా తీస్తే తెలిసిన నిజం ఏంటంటే…బ్రయన్ పెట్టే కండిషన్లే అని తెలిసింది. ఈ మధ్యనే ఓ పాడ్ కాస్ట్ లో బ్రయన్ మాట్లాడాడు. అందులో అతని కండీషన్ల గురించి చెప్పాడు కూడా. బ్రయన్ అందంగా ఉండడం కోసం చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడట. ఉదయం 6 నుంచి 11లోపు మాత్రమే తింటాడట. అది కూడా లెక్కగా 2250 క్యాలరీలు మాత్రమే. దాని తర్వాత ఏం ఇచ్చినా తినడు, తాగడు. అదీ కాక రాత్రి 8.30 గంటలకే నిద్రపోతాడట. న్యూట్రిషనిస్ట్‌ చెప్పిన ఫుడ్ కాకుండా ఇంకేమీ చచ్చినా తినడట. ముడుచుకుని పడుకోవడం కూడా అలవాటు అని చెబుతున్నాడు. ఇదిగో సరిగ్గా ఈ అలవాట్లు, కండిషన్లే అమ్మాయిలను దూరంగా పారిపోయేలా చేస్తోంది. ఇంత స్ట్రిక్ట్ గా ఉంటే ఇతనితో వేగడం కష్టం…ఎంత డబ్బుంటే మాత్రం ఏం లాభం సుఖం లేనప్పుడు అంటూ మొహం చాటేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...

Loading...
Unable to load recommendations.
Follow Us