అరుదైన ట్యాలెంట్‌.. రెండుచేతులతో.. రెండు భాషలలో ఒకేసారి

|

Feb 15, 2023 | 8:46 AM

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘శివాజీ’ సినిమాను చూసే ఉంటారు కదా. ఆ సినిమాలో రజినీ తన రెండు చేతులతో పేపర్ల మీద టకటకా సంతకాలు చేయడం చూసి మనమంతా వావ్ అనుకున్నాం కదా..

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘శివాజీ’ సినిమాను చూసే ఉంటారు కదా. ఆ సినిమాలో రజినీ తన రెండు చేతులతో పేపర్ల మీద టకటకా సంతకాలు చేయడం చూసి మనమంతా వావ్ అనుకున్నాం కదా.. అలాంటి ప్రతిభ కలిగిన ఓ యువతి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మంగళూరుకు చెందిన ‘ఆది స్వరూప అనే 17 ఏళ్ల బాలిక రెండు చేతులతో ఒకేసారి బోర్డుపై రాస్తుంది. అది కూడా కళ్లు మూసుకుని. ఈమెలో ఎన్నో అరుదైన ప్రత్యేకతలు ఉన్నాయి. ఈమె 11 విధాల చేతివ్రాతను రాయగలదట. అంతేకాదు ఇంగ్లీషు, కన్నడ భాషల్లో ఒకేసారి రెండు చేతులతో రాయగలదట. ఆమె రచనా నైపుణ్యం చాలా ప్రత్యేకమైనది. మొత్తంమీద ఆమె ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు రాసే క్రమంలో తన మెదడు ఏకకాలంలో పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. పది లక్షల మందిలో ఒకరికి మాత్రమే ఈ ప్రత్యేక సామర్థ్యం, ప్రతిభ ఉంటుంది’. ఇదే కథనాన్ని ప్రముఖ న్యూస్ ఏజన్సీ ANI కూడా ప్రచురించింది. కాగా, ఆది స్వరూప స్టడీ సెంటర్‌ను ఏర్పాటు చేసి రెండు చేతులతో రాయడంలో ఆసక్తి ఉన్న వారికి శిక్షణ కూడా అందిస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బైక్‌పై యువతి విన్యాసాలు.. ఇంతలో ఒక్క దెబ్బకు.. వీడియో చూసి మండిపడుతున్న నెటిజన్లు

Samantha: దేవుడా.. నువ్వే దిక్కు.. మొక్కు తీర్చుకున్న సామ్..

Taraka Ratna: బిడ్డ కోసం బాలయ్య షాకింగ్ నిర్ణయం !! ఏం చేయబోతున్నారు అంటే ??

Anushka Shetty: అనుష్కకు అరుదైన నరాల వ్యాధి ?? మరి షూటింగ్ సంగతి ఏంటి అంటూ షాకింగ్ కామెంట్స్

Jagapathi Babu: ఆ షూటింగ్లో కనీసం అన్నం కూడా పెట్టకుండా అవమానించారు

 

Follow us on