రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్‌లైన్ మోసం..

Updated on: Feb 28, 2026 | 9:07 PM

నేటి కాలంలో ఆన్‌లైన్ షాపింగ్ పెరిగినప్పటికీ, మోసాలు కూడా అధికమయ్యాయి. హుబ్బళ్లిలో ఒక వ్యక్తి 60 వేల రూపాయల విలువైన కెమెరాను అమెజాన్ ద్వారా ఆర్డర్ చేయగా, పార్సిల్‌లో రెండు సర్ఫ్ ప్యాకెట్లు వచ్చాయి. పార్సిల్ ఓపెనింగ్ వీడియో రుజువుగా ఉన్నా, అమెజాన్ స్పందించకపోవడంపై బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ కొనుగోళ్లలో జాగ్రత్త వహించాలని ఇది సూచిస్తుంది.

నేటి కాలంలో షాపింగ్‌ అర్థమే మారిపోయింది. ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఆన్‌లైన్ ద్వారా అవసరమైన వస్తువులు ఆర్డర్ పెట్టుకోవటం ఎక్కువైపోయింది. ఆన్‌లైన్ షాపింగ్‌లో మోసాలు కూడా పెరిగిపోయాయి. కొందరు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. రకరకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా, ఆన్‌లైన్‌లో కెమెరా ఆర్డర్ పెట్టుకున్న ఓ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. పార్సిల్‌లో కెమెరా బదులుగా రెండు సర్ఫ్ ప్యాకెట్లు వచ్చాయి. ఈ ఘటన కర్ణాటకలోని హుబ్బలిలో జరిగింది. హుబ్బళ్లికి చెందిన ఆల్‌ఫ్రెడ్ అనే వ్యక్తి దుబాయ్‌లో స్థిరపడ్డారు. అక్కడే బిజినెస్ చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం అతడు తన సొంత ఊరికి వచ్చారు. తన స్నేహితుడి కోసం అమెజాన్‌లో కెమెరా ఆర్డర్ పెట్టారు. దాని విలువ 60 వేల రూపాయలపైనే ఉంది. శనివారం ఆ పార్సిల్ ఓ ప్రైవేట్ హోటల్ అడ్రస్‌కు వచ్చింది. అతను వెళ్లి పార్సిల్ తీసుకున్నారు. దాన్ని ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యారు. 60 వేల రూపాయల కెమెరాకు బదులుగా రెండు సర్ఫ్ ప్యాకెట్లు కనిపించాయి. ఆల్‌ఫ్రెడ్ వెంటనే అమెజాన్ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేశారు. వారినుంచి సరైన స్పందన లేదు. దుబాయ్‌లో ఉన్నపుడు చాలాసార్లు అమెజాన్ నుంచి వస్తువులు ఆర్డర్ పెట్టాననీ కానీ ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు. ఈసారి తన ఫ్రెండ్ కోసం కెమెరా ఆర్డర్ పెట్టగా కెమెరాకు బదులుగా రెండు సర్ఫ్ ప్యాకెట్లు వచ్చాయనీ పార్సిల్ ఓపెన్ చేసే సమయంలో వీడియో కూడా తీశామనీ ఆ సాక్ష్యం తమ దగ్గర ఉందనీ అన్నారు. అయినా కూడా అమెజాన్ వాళ్లు సరిగా స్పందించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు

Gold & Silver Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంత పెరిగిందంటే

18 లక్షల సార్లు స్కిప్పింగ్‌ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ

పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు

ఫ్రెంచ్‌ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..

Follow Us