హర్రర్ మూవీని తలపించిన అఘోరీ పూజలు !! చితాభస్మాన్ని ఒంటికి రుద్దుకుని ??

Updated on: Nov 25, 2024 | 9:20 PM

సాధారణంగా అఘోరీలు మనుషులకు దూరంగా హిమాలయాల్లోనో, ఇతర ఆథ్యాత్మిక కేంద్రాల్లోనో ఉంటారు. కుంభమేళాలు సమయంలో అఘోరీలు బయటకు వస్తారు. పుణ్యనదీస్నానమాచరించి తిరిగి వారి స్థావరాలకు వెళ్లిపోతారు. కానీ కొన్ని రోజులుగా ఓ అఘోరీ జనాల మధ్య తిరుగుతుండటం సంచలనంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ వివిధ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ పలు ప్రకటనలు చేస్తోంది అఘోరీ.

తాజాగా మంగళవారం అఘోరీ గుంటూరునుంచి వరంగల్‌కు వచ్చింది. అంతేకాదు హర్రర్‌ మూవీని తలపించే రీతిలో పూజలు చేసింది. ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వరంగల్‌ జిల్లాలో సంచరిస్తున్న అఘోరీ.. నగర శివారులోని బెస్తన్‌ చెరువు సమీపంలో ఉన్న స్మశాన వాటికలో ఒళ్ళు గగుర్పొడిచే రీతిలో పూజలు చేసింది. స్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించే శివపేటిక వద్ద పడుకొని చిత్రవిచిత్రంగా ప్రవర్తించింది. శవాన్ని దహనం చేసిన బూడిదంత తన ఒంటిపై రుద్దుకుంది. అంతటితో ఆగలేదు.. చుట్టూ త్రిశూలాలు ఏర్పాటు చేసుకొని అచ్చం హర్రర్ మూవీని తలపించే తరహాలో పూజలు నిర్వహించింది. తన వెంట పూజ సామాగ్రి, కోడిని తెచ్చుకున్న అఘోరి అదే స్మశాన వాటికలో చుట్టూ త్రిశూలాలు పెట్టి ఆ త్రిశూరాల మధ్య కూర్చొని విచిత్ర పూజలు నిర్వహించింది . కోడి బలిచ్చి రక్తర్పనం చేసింది. గుమ్మడికాయని కోసి ఆ గుమ్మడికాయ పై గంటకు పైగా విచిత్రమైన పూజలు నిర్వహించింది. అఘోరి విచిత్ర పూజలు చూసి స్థానికులు తీవ్ర భయాందోళన చెందారు.. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియక ప్రజలంతా హడలెత్తిపోయారు. అఘోరిని చూడడం కోసం ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి బారులుతీరారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అక్కడ నుంచి పంపించేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చితి నుంచి లేచి నీళ్లడిగిన అవ్వ !! షాకింగ్‌ ఘటన

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??

Published on: Nov 25, 2024 09:11 PM
Loading...
Unable to load recommendations.
Follow Us