Kartik Aaryan: నన్ను పెళ్లి చేసుకో.. రూ.20 కోట్లు ఇస్తా..! ఈ హీరో సరదా రిప్లై వైరల్ ! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
తనకిష్టమైన హీరోకి పెళ్లి ప్రపోజల్ పంపి ఓ అమ్మాయి అందర్నీ ఆశ్చర్యపరిచింది. సోషల్‌మీడియా వేదికగా ఆమె పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆ హీరో ఎవరంటే.. కార్తిక్ ఆర్యన్.
తనకిష్టమైన హీరోకి పెళ్లి ప్రపోజల్ పంపి ఓ అమ్మాయి అందర్నీ ఆశ్చర్యపరిచింది. సోషల్‌మీడియా వేదికగా ఆమె పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆ హీరో ఎవరంటే.. కార్తిక్ ఆర్యన్. ‘ప్యార్ కా పంచనామా’తో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, మొదటి సినిమాతో యువతుల్లో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకున్న బాలీవుడ్ యువ హీరో కార్తిక్ ఆర్యన్. కెరీర్ ఆరంభంలోనే స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న కార్తిక్ ఇప్పుడు వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ‘భూల్ భూలియా -2’, ‘షెహ్‌జాదా’ చిత్రాలు చేస్తున్నారు. షూట్స్‌లో కాస్త విరామం దొరకడంతో ‘లూడో’ ఫేమ్, బాలనటి ఇనాయత్ వర్మతో కలిసి కార్తిక్ తాజాగా ఓ స్పెషల్ వీడియో క్రియేట్ చేశారు. కార్తిక్ నటించిన ‘ధమాకా’లోని ఓ పవర్‌ఫుల్ డైలాగ్‌ని ఇనాయత్ చెప్పగానే.. క్యూట్‌గా ఉందంటూ ఆయన నవ్వులు పూయించారు. దీనికి సంబంధించిన వీడియోని కార్తిక్ ఇన్‌స్టా వేదికగా షేర్ చేయగా.. దానిపై స్పందించిన ఓ లేడీ ఫ్యాన్.. ‘‘కార్తిక్.. మీరంటే నాకు ఇష్టం. మీకు 20 కోట్లు ఇస్తా. నన్ను పెళ్లి చేసుకోండి’’ అని పోస్ట్ చేసింది. దానిపై స్పందించిన కార్తిక్.. ‘‘ఎప్పుడు’’ అని సరదాగా రిప్లై ఇచ్చారు. అనంతరం తనపై బిడ్డింగ్ ప్రారంభమైందని అన్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
NTR-Ram Charan-RRR: ఒకరు మన్యం ధీరుడు.. మరొకరు గిరిజన వీరుడు.. రామ్ భీమ్‌ల మధ్య స్నేహం..
Alia Bhatt: చీరకట్టులో సీతమ్మ.. అమ్మడి అందాలు అదుర్స్.. అలియా లేటెస్ట్ ఫోటోస్..
Anasuya Bharadwaj: రంగమ్మ అత్తలో మరో కోణం.. బట్టబయలు అవుతున్న అనసూయ నటవిశ్వరూపం.. (ఫొటోస్)
anupama parameswaran: చూసిన తనివి తీరని చీరకట్టులో అనుపమ అందాల ఒంపు సొంపులు..(ఫొటోస్)
